Pressure Cooker Explodes: పేలిన ప్రెజర్ కుక్కర్‌.. తర్వాత ఏం జరిగిందంటే.? వీడియో వైరల్.

Pressure Cooker Explodes: పేలిన ప్రెజర్ కుక్కర్‌.. తర్వాత ఏం జరిగిందంటే.? వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Dec 18, 2023 | 7:42 AM

పంజాబ్‌లోని పాటియాలాలో ఓ కుటుంబం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఒక ఇంట్లోని వంట గదిలో ఆహారం వండుతుండగా ప్రెజర్‌ కుక్కర్‌ పేలింది. ఆ సమయంలో ఆ వంట గదిలో ఉన్న మహిళలు, కాస్త దూరంలో ఉన్న ఒక వ్యక్తి, ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌ పేలడంతో ఆ వంట గది, అక్కడి వస్తువులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పంజాబ్‌లోని పాటియాలాలో ఓ కుటుంబం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఒక ఇంట్లోని వంట గదిలో ఆహారం వండుతుండగా ప్రెజర్‌ కుక్కర్‌ పేలింది. ఆ సమయంలో ఆ వంట గదిలో ఉన్న మహిళలు, కాస్త దూరంలో ఉన్న ఒక వ్యక్తి, ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రెజర్‌ కుక్కర్‌ పేలడంతో ఆ వంట గది, అక్కడి వస్తువులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తాజాగా ఏక్తా విహార్‌ ప్రాంతంలోని ఒక ఇంట్లోని వంట గదిలో ఇద్దరు మహిళలు ఆహారం తయారు చేస్తున్నారు. అయితే గ్యాస్ పొయ్యి మీద ఉన్న ప్రెజర్ కుక్కర్‌ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి వంట గదితోపాటు అక్కడి వస్తువులు, చిమ్నీ ధ్వంసమయ్యాయి. ప్రెజర్‌ కుక్కర్‌ పేలిన శబ్ధం విన్న వెంటనే వంట గదిలో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఒక వ్యక్తి ఉండగా, ఒక బాలుడు బాల్‌తో ఆడుకుంటున్నాడు. ఆ ఇద్దరితో పాటు ఇంట్లో ఉన్న వారు కూడా భయంతో బయటకు పరుగుతీశారు. అయితే ప్రెజర్‌ కుక్కర్‌ పేలిన ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.