కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??
అరుదుగా సంభవించే కవలల జననానికి ఆ దేశం వేదికైంది. థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. అయూథలా ప్రావిన్స్‌లోని ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు.
అరుదుగా సంభవించే కవలల జననానికి ఆ దేశం వేదికైంది. థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. అయూథలా ప్రావిన్స్‌లోని ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్‌చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్‌చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశానని, కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో తన కాలు విరిగిందని 31 ఏళ్ల మావటి నవ్వుతూ చెప్పాడు. పసికూనను కాపాడిన ఆనందంలో తనకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదని ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసిందని అన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??
యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా

విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా..వీడియో

చుండ్రు తలలోనే కాదు కళ్లపైన కూడా.. జాగ్రత్తపడకపోతే అంతే!

ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో

వీళ్ల తెలివికి హ్యాట్సాఫ్.. నీళ్లలో కొట్టుకుపోతుంటే వీడియో

అడవిలో కొత్త జంట హనీమూన్.. ఊహించని అతిథుల హల్చల్ వీడియో

సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు

పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్
