బైకును ఢీకొట్టి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్‌.. ఆ తర్వాత..

టర్నింగ్‌ తీసుకుంటున్న ఓ ఆటో.. అటుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్‌ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్‌లో ఉండటంతో నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ ఘటన జరిగింది. షాహుపురిలోని పాట్కీ ఆసుపత్రి సమీపంలో ఒక ఆటో యూ టర్న్‌ తీసుకుంటున్న ఆటో.. అదే సమయంలో వేగంగా అటువైపు వచ్చిన బైక్‌ను ఆటో ఢీకొట్టింది.

బైకును ఢీకొట్టి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్‌.. ఆ తర్వాత..

|

Updated on: Jun 19, 2024 | 11:20 PM

టర్నింగ్‌ తీసుకుంటున్న ఓ ఆటో.. అటుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్‌ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్‌లో ఉండటంతో నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ ఘటన జరిగింది. షాహుపురిలోని పాట్కీ ఆసుపత్రి సమీపంలో ఒక ఆటో యూ టర్న్‌ తీసుకుంటున్న ఆటో.. అదే సమయంలో వేగంగా అటువైపు వచ్చిన బైక్‌ను ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పడ్డారు. అయితే ఆటో రన్నింగ్‌లో ఉండటంతో రోడ్డుపై రౌండ్లు కొట్టింది. ఈ క్రమంలో నడిచి వెళ్తున్న వారి మీదకు ఆటో దూసుకెళ్లింది. చివరకు రోడ్డు పక్కగా ద్విచక్ర వాహనాలు అడ్డుగా ఉండటంతో ఆ ఆటోను కంట్రోల్‌ చేశారు. ఈ సంఘటనలో మహిళలతో సహా ఐదుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య కంట్లో పడ్డ భర్త నిర్వాకం.. ఏం చేశాడో తెలుసా ??

Follow us