ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు చెందాల్సిన బెనిఫిట్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ఒక సంస్థలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే, వారు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు అవుతారు. వాస్తవానికి మీరు కొత్త కంపెనీలో చేరిన ప్రతిసారీ, మీ కాస్ట్-టు-కంపెనీ - సీటీసీలో కొంత భాగం గ్రాట్యుటీకి జమ అవుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీ పొందడానికి అర్హులు అవుతారు.
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు చెందాల్సిన బెనిఫిట్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ఒక సంస్థలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే, వారు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు అవుతారు. వాస్తవానికి మీరు కొత్త కంపెనీలో చేరిన ప్రతిసారీ, మీ కాస్ట్-టు-కంపెనీ – సీటీసీలో కొంత భాగం గ్రాట్యుటీకి జమ అవుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీ పొందడానికి అర్హులు అవుతారు. గ్రాట్యుటీ పొందే విషయంలో వీరి మధ్య ఎలాంటి భేదం ఉండదు. పేమెంట్ అండ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం, ఒక కంపెనీ లేదా షాపులో 10 లేదా అంత కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్లు గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి అర్హులు అవుతారు. ఒక ఉద్యోగి బేసిక్ సాలరీలో 4.81 శాతాన్ని గ్రాట్యుటీ కింద ఇస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ. 5,00,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు అయితే, అతను 4.81 శాతం గ్రాట్యుటీకి అర్హుడు అవుతాడు. అప్పుడు అతనికి మొత్తంగా రూ.24,050 గ్రాట్యుటీగా అందుతుంది. అంటే సదరు ఉద్యోగి నెలకు దాదాపు రూ.2,000 వరకు గ్రాట్యూటీ పొందినట్లు లెక్క.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా