పాప్‌కార్న్‌ ప్యాకెట్‌లో పాము !! షాక్‌ తిన్న మహిళ !!

అమెరికాలోని వర్జీనియా( Virginia)లో గ్రాసరీస్ కొనేందుకు మార్ట్‌కు వెళ్లిన ఓ మహిళ షాకింగ్ అనుభవాన్ని ఫేస్ చేసింది. ఊహించని ఘటనతో ఆమె అక్కడ్నుంచి ఉరుకులు పరుగులు తీసింది.

Phani CH

|

Aug 13, 2022 | 9:42 AM

అమెరికాలోని వర్జీనియా( Virginia)లో గ్రాసరీస్ కొనేందుకు మార్ట్‌కు వెళ్లిన ఓ మహిళ షాకింగ్ అనుభవాన్ని ఫేస్ చేసింది. ఊహించని ఘటనతో ఆమె అక్కడ్నుంచి ఉరుకులు పరుగులు తీసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. వర్జీనియాలోని లునెన్‌బర్గ్ కౌంటీలోని షాపర్స్ వాల్యూ స్టోర్‌కి కిమ్బెర్లీ స్లాటర్ అనే మహిళ వెళ్లింది. ఆపై ఓ వీల్ బాస్కెట్ తీసుకుని.. అందులో తనకు కావాల్సిన వస్తువులు వేసుకుంటూ వస్తుంది. ఇంతలోనే ఆ బాస్కెట్ లోపల ఎలుకల మలం ఉన్నట్లు భావించింది. దీంతో ఆ బాస్కెట్ అక్కడే పడేసింది. ఆ కింద ఎలుక బోన్లు ఉండటం కూడా ఆమె గమనించింది. దీంతో మార్ట్‌లో ఎలుకలు తిరుగున్నాయేమో అనుకుంది. ఆపై మరో వీల్ బాస్కెట్ తీసుకుని షెల్ప్‌లో ఉన్న పాప్‌కార్న్ ప్యాకెట్ అందులో వేసింది. ముందుకు నడుస్తుంగా.. ఆ ప్యాకెట్‌కు కుడివైపున ఓ రంధ్రం ఉంది. ఏంటా అని అనుమానంతో చూస్తుండగానే అందులో నుంచి ఓ పాము బయటకు వచ్చింది. దీంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. అది రాట్ స్నేక్‌గా గుర్తించారు. ఒక ఉద్యోగి వచ్చి మార్ట్ నుంచి ఆ పామును బయటకు తరిమాడు. తనకు ఓ చిన్న పాప ఉందని.. ఆ ప్యాకెట్ ఇంటికి తీసుకెళ్తే ఏం జరిగేదో ఊహించుుంటనే భయం వేస్తుందని స్లాటర్ తెలిపారు. కాగా ఆ పాము ఎక్కడ నుండి వచ్చిందో తమకు తెలియదని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మార్ట్ యాజమాన్యం తెలిపింది. షాపర్స్ వాల్యూలో సమస్యలు కొత్తేం కాదని.. వారు కస్టమర్ల ఆరోగ్యం, సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందని స్లాటర్ చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రం అడుగున చెస్.. ఐడియా అదుర్స్ బాసూ

నాగచైతన్య చేతిపై ఉండే టాటూ అర్థం ఏంటో తెలుసా ?? అసలు విషయం చెప్పిన అక్కినేని యంగ్‌ హీరో 06.

అతి అంటే ఇదే !! కడుపుతో ఇలాంటి పనులు చేయడం ఏంటి ??

యూపీలో తేలియాడే రామసేతు రాయి !! భక్తుల పూజలు

చీకట్లో ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం !! ఆ యువకుడు ఏంచేశాడో చూడండి.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu