చీకట్లో ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం !! ఆ యువకుడు ఏంచేశాడో చూడండి.

దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే.. వీటికి సంబంధిన సినిమాలు మాత్రం మహా ఆసక్తిగా చూస్తారు జనాలు. ఇటీవల దెయ్యాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వణుకుపుట్టిస్తున్నాయి.

Phani CH

|

Aug 13, 2022 | 9:32 AM

దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే.. వీటికి సంబంధిన సినిమాలు మాత్రం మహా ఆసక్తిగా చూస్తారు జనాలు. ఇటీవల దెయ్యాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వణుకుపుట్టిస్తున్నాయి. అయినా వీటిని ఎంతగానో ఇష్టపడతారు నెటిజన్లు. తాజాగా ఓ దెయ్యం ఇద్దరు యువకులకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్‌ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు ఓ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓ చోట మలుపు తిరుగుతుండగా సడన్‌గా ఓ దెయ్యం ఎదురయ్యింది. ఆ దెయ్యాన్ని చూసిన ఓ కుర్రాడు భయంతో కిందపడిపోయాడు. వెంటనే లేచి పరుగు లంకించుకున్నాడు. ఇంకొక యువకుడు మాత్రం దాన్ని పరిశీలనగా చూశాడు… ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. వెంటనే ఆ దెయ్యానికి ఓ ఫ్లైంగ్ కిస్ ఇచ్చాడు. దెబ్బకు ఆ దెయ్యం మూర్ఛపోయి పడిపోయింది. ఏది ఏమైనా ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది నిజం కాదని, ఈ వీడియో వినోదం కోసం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను చూస్తున్న వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషిలా కూర్చుని ఆహారం తింటున్న మేక !! నెట్టింట వీడియో వైరల్

హోం వర్క్‌ చేయలేక విసిగిపోయిన కుర్రాడు !! ఈ లోకం విడిచిపోతానంటూ అమ్మపై ఆగ్రహం

సెలయేట్లో ఎలుగుబంట్ల గెట్‌ టుగెదర్‌ !! ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

రాలిన ఆకులా ఉన్న జీవి !! విశాఖ తీరంలో ప్రత్యక్షం

పచ్చనికాపురంలో చికెన్‌ పకోడి చిచ్చు !! అసలేం జరిగిందంటే ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu