మనిషిలా కూర్చుని ఆహారం తింటున్న మేక !! నెట్టింట వీడియో వైరల్

పెంపుడు జంతువులు సాధారణంగా తమ యజమానులతో ఎంతోబాగా కలిసిపోతాయి. వారితో కలిసిమెలిసి తిరుగుతూ వారు చేసే పనులను అనుకరిస్తుంటాయి.

Phani CH

|

Aug 13, 2022 | 9:30 AM

పెంపుడు జంతువులు సాధారణంగా తమ యజమానులతో ఎంతోబాగా కలిసిపోతాయి. వారితో కలిసిమెలిసి తిరుగుతూ వారు చేసే పనులను అనుకరిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లలో కోళ్లు, మేకలు, ఆవులు తదితర జంతువులను పెంచుకోవడం సర్వసాధారణం. ఇదిలా ఉంటే తాజాగా ఓ మేకకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ గోల్డ్‌ కలర్‌లో ఉన్న ఓ మేక డైనింగ్‌ టేబుల్‌ ముందు చైర్‌లో కూర్చుని ఆహారం తింటుంది. ఆ.. ఏముందిలే.. కుర్చీమీద నిలబడి తిని ఉండొచ్చు అనుకోకండి. అది అచ్చం మనిషిలాగానే కుర్చీలో కూర్చుని ఉంది. ఆ మేకకి ఓ బాలిక చిన్న పిల్లాడికి అన్నం పెట్టినట్టుగా ఆహారం పెడుతుంది. మధ్య మధ్యలో ఆ మేకకూడా ఆహారాన్ని తన కాళ్లతో అందుకుని తింటుంది. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసారు. దీనికి ‘ప్రత్యేక అతిథి’ అనే క్యాప్షన్‌ జోడించారు. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హోం వర్క్‌ చేయలేక విసిగిపోయిన కుర్రాడు !! ఈ లోకం విడిచిపోతానంటూ అమ్మపై ఆగ్రహం

సెలయేట్లో ఎలుగుబంట్ల గెట్‌ టుగెదర్‌ !! ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

రాలిన ఆకులా ఉన్న జీవి !! విశాఖ తీరంలో ప్రత్యక్షం

పచ్చనికాపురంలో చికెన్‌ పకోడి చిచ్చు !! అసలేం జరిగిందంటే ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu