AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చనికాపురంలో చికెన్‌ పకోడి చిచ్చు !! అసలేం జరిగిందంటే ??

పచ్చనికాపురంలో చికెన్‌ పకోడి చిచ్చు !! అసలేం జరిగిందంటే ??

Phani CH
|

Updated on: Aug 13, 2022 | 9:23 AM

Share

అన్యోన్యంగా సాగిపోతున్న వారి సంసారంలో చికెన్ పకోడి చిచ్చు రేపింది. రుచిగా లేదన్న ఒకే ఒక్క కారణంతో అమాంతం కోపం పెంచేసుకున్నాడు భర్త. అంతటితో ఆగకుండా భార్యను చావబాదాడు.

అన్యోన్యంగా సాగిపోతున్న వారి సంసారంలో చికెన్ పకోడి చిచ్చు రేపింది. రుచిగా లేదన్న ఒకే ఒక్క కారణంతో అమాంతం కోపం పెంచేసుకున్నాడు భర్త. అంతటితో ఆగకుండా భార్యను చావబాదాడు. కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆ తర్వాత తీవ్ర భయాందోళనకు గురై చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. బెంగళూరు నగరంలోని అరెకెరే లేఔట్‌లో నివసించే ఓ వ్యక్తి తన భార్యను చికెన్‌ పకోడి చేయమని చెప్పి ఫ్యాక్టరీ విధులకు వెళ్లిపోయాడు. సాయంత్రం అతను వచ్చే సమయానికి చికెన్ పకోడా చేసి రెడీగా ఉంచింది భార్య. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు చికెన్ పకోడీ వడ్డించింది. అది తిన్న అతనికి చికెన్ పకోడి రుచి నచ్చలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై భార్యని తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తల, చేతులపై గాయాలయ్యాయి. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు. భయంతో అతని భార్య అరచిన అరుపులకు చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమయ్యారు. వారి ఇంటికి వచ్చి ఆ మహిళ పరిస్థితి చూసి, వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి ఆ మహిళ వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె భర్త సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. పరారైన సురేశ్ కోసం గాలిస్తున్న పోలీసులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. సురేశ్ తన ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై దాడి చేయడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: మునుగోడు…హై వోల్టేజ్… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Published on: Aug 13, 2022 09:23 AM