హోం వర్క్ చేయలేక విసిగిపోయిన కుర్రాడు !! ఈ లోకం విడిచిపోతానంటూ అమ్మపై ఆగ్రహం
స్కూలునుంచి రాగానే పిల్లలు సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటారు. అప్పటివరకూ స్కూల్‌లో రాసి, చదివి అలసిపోతారు. ఇక ఇంటికి రాగానే హోమ్ వర్క్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు.
స్కూలునుంచి రాగానే పిల్లలు సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటారు. అప్పటివరకూ స్కూల్‌లో రాసి, చదివి అలసిపోతారు. ఇక ఇంటికి రాగానే హోమ్ వర్క్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. సరదాగా ఆడుకుంటేనే వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు అమ్మ హోమ్ వర్క్ చేయమనిచెప్పినా వినరు.. పైగా అమ్మమీద కోప్పడతారు కూడా.. సరిగ్గా అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు టేబుల్ ముందు కూర్చుని హోం వర్క్ చేస్తున్నాడు. ఇక తాను హోమ్ వర్క్ చేయలేక విసిగిపోయిన ఆ కుర్రాడు తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నానని పదేపదే పెన్సీల్‌తో బాదుతూ తల్లితో అంటాడు. అయితే ఈ లోకం నుంచి ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటున్నావని తల్లి ఆ బుడ్డోడిని అడిగితే.. నాకు ఈ ప్రపంచం అవసరం లేదు.. నువ్వు అందంగా లేవు అంటూ బదులివ్వడంతో తల్లి ఒక్కసారిగా పెద్దగా నవ్వేసింది. ఈ పిల్లాడు మాట్లాడిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెలయేట్లో ఎలుగుబంట్ల గెట్ టుగెదర్ !! ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

