సెలయేట్లో ఎలుగుబంట్ల గెట్ టుగెదర్ !! ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో ఒకసారి గెట్ టు గెదర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. మరి జంతువులు కూడా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటాయని తెలుసా?
సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో ఒకసారి గెట్ టు గెదర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. మరి జంతువులు కూడా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటాయని తెలుసా? ఆ గెట్ టు గెదర్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఎలుగుబంట్లు సాధారణంగానే ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటాయి. నీటి ప్రవాహం ఉన్న చోటకు వెళ్లి.. చేపలను వేటాడి కడుపు నింపుకుంటాయి. అయితే, గుంపుగా వెళ్లి వేటాడి తినడమే ఇక్కడ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సెలయేరు వద్దకు వెళ్లి చేపల వేట సాగించాయి. అందినకాడికి కడుపు నిండా తినేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానికి ‘వీకెండ్ గెట్ టు గెదర్’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోలో కొన్ని ఎలుగుబంట్లు సెలయేరు అవతలి గట్టు నుంచి ఇవతలి గట్టు వరకు వరుసగా నిలబడ్డాయి. ఎగువ ప్రవాహానికి ఎగురుతున్న చేపలను లటుక్కున పట్టుకుని గుటుక్కున మింగేస్తున్నాయి. చూడటానికి ఈ దృశ్యం చాలా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే నెటిజన్లు దాన్ని రీట్వీట్ చేస్తున్నారు. లక్షలమంది వీక్షిస్తూ తమదైనశైలిలో కామెంట్లు విసురుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

