రాలిన ఆకులా ఉన్న జీవి !! విశాఖ తీరంలో ప్రత్యక్షం
రాలిన ఆకు లాంటి శరీరం ఉన్న అరుదైన జీవి విశాఖ తీరంలో కనిపించింది. అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్’ జాడ విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది.
రాలిన ఆకు లాంటి శరీరం ఉన్న అరుదైన జీవి విశాఖ తీరంలో కనిపించింది. అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్’ జాడ విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది. సాధారణంగా సముద్ర తీరంలో ఆటుపోట్లు సంభవించే ప్రాంతంలో వివిధ రకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి. వీటిలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేస్తున్నారు విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ సభ్యులు. వైజాగ్ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఫ్లాట్‌వార్మ్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్ జూలై మొదటి వారంలో ప్రచురించింది. విశాఖలో మెరైన్ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. వెళ్లవు. ఇవి చిన్న చిన్న పీతలను, వీటికన్నా చాలా చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

