ఇది కదా స్మార్ట్ వర్క్ అంటే.. అతని టెక్నిక్‌కి అవాక్కవ్వాల్సిందే
ఏదైనా పనిచేయాలంటే కొందరు చాలా కష్టపడతారు. అదే పనిని కొందరు చాలా తెలివిగా ఈజీగా చేసేస్తారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వ్యక్తి ఉపయోగించిన టెక్నిక్‌కి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదిక దా స్మార్ట్ వర్క్ అంటే.. అంటూ ఫిదా అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియలో ఇద్దరు వ్యక్తులు సంచుల్లో ఇసుక నింపే పని చేస్తున్నారు.
వారిలో ఒకతను అందరిలాగే పార తీసుకొని ప్లాస్టిక్ బకెట్‌లోకి ఇసుక ఎత్తి సంచుల్లో నింపుతున్నాడు. మరో వ్యక్తి మాత్రం చాలా తెలివిగా ఎంతో ఈజీగా సంచిలో ఇసుక నింపి శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ అతను వాడిన టెక్నిక్ ఏంటంటే.. ఇసుక నింపాల్సిన సంచిలో ఆ సంచికి సరిపడా పట్టే ఓ పైపును తొడిగాడు..ఆ తర్వాత ఎంతో ఈజీగా ఇసుక నింపేసాడు. కుంచంతో ధాన్యం కొలుస్తున్నట్టుగా పైపుతో ఎంతో సులువుగా సంచిలో ఇసుక నింపాడు. తర్వాత పైపు బయటకు తీయగానే సంచి మొత్తం ఇసుకతో నిండిపోయింది. అంతేకాదు, తన తోటి కార్మికుడు ఉపయోగించిన బకెట్‌తో కూడా అంతే ఈజీగా ఇసుక నింపి చూపించాడు. తక్కువ శ్రమతో ఎక్కువ పని జరగడమే కాకుండా సులభంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒకరిది హార్డ్ వర్క్.. ఇంకొకరిది స్మార్ట్ వర్క్ అని కొందరు, స్మార్ట్ వర్క్ అంటే ఇదీ అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు లక్షమంది వీక్షించారు. వందలాదిమంది లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా
రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు
ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

