రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు
రావణుడిని మన దేశంలో ఎలా గుర్తిస్తారో తెలిసిందే. సీతాదేవిని అపహరించి, శ్రీరాముడిని కష్టాలకు గురిచేసిన రాక్షసుడిగానే భావిస్తారు. అందుకే ప్రతీ ఏటా దసరా రోజున రావణ దహనం చేసి చెడుపై మంచి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ రావణుడిని దేవుడిగా కొలిచే గ్రామం ఉంది. ఆలయం నిర్మించి నిత్య పూజలు కూడా చేస్తున్నారు. ఇది తరతరాలుగా సాగుతున్న సంప్రదాయం అక్కడ!
రాజస్థాన్‌లోని జోథ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరంలో మండోర్ అనే గ్రామం ఉంది. ఇక్కడే రావణాసరుడి ఆలయం ఉంది. రావణుడి భార్య మండోదరి ఇక్కడే పుట్టిందని స్థానికులు నమ్ముతారు. పూర్వం ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడట. అతని కుమార్తె మండోదరి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేదట. రావణాసురుడు ఒక యజ్ఞం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే రావణాసురుడు ధర్మాత్మురాలైన మండోదరి గురించి విన్నాడట. తాను చేయబోతున్న యజ్ఞం కోసం మండోదరి అవసరం ఏర్పడిందట. దాంతో రావణుడు లంక నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడట. ఆమెను పెళ్లిచేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లాడని స్థానికులు చెబుతున్నారు. మండోర్ ప్రజలు మాత్రం రావణుడి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయన శివభక్తిని, శక్తి సామర్థ్యాలను, మేధాశక్తిని ఇక్కడి వారు గౌరవిస్తుంటారు. అందుకే, దసరా రోజున దేశవ్యాప్తంగా రావణాసురుడి బొమ్మలు దహనం చేస్తే, ఇక్కడ మాత్రం రావణాసురుడి మృతికి సంతాపం ప్రకటిస్తుంటారు. ఆ రోజున దశ కంఠుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మండోర్‌లోని అమర్ నాథ్ ఆలయ ప్రాంగణంలో లంకాధిపతి ఆలయం ఉంది. ఇక్కడ రావణాసురుడిని దేవుడిగానే పూజిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే మండోదరి విగ్రహం కూడా పూజలందుకుంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావణ భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

