ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే
ప్రపంచంలోనే అతిఎత్తైన హిందూ ఆలయాల్లో ఉమియా దేవి మందిరం ఒకటి. గుజరాత్‌లోని జాస్పూర్లో 60 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ ఉమియా దేవి మందిరాన్ని విశ్వ ఉమియా ఫౌండేషన్ నిర్మిస్తోంది. దేశంలోనే అతిపెద్ద కాంక్రీట్ రాఫ్ట్గానూ ఇది నిలవనుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాఫ్ట్, భారత్‌లో తొలిసారిగా నిర్మితమవుతోంది.
సుమారు 24,000 ఘన మీటర్లు కాంక్రీట్ వినియోగించారు. రాఫ్ట్ కాస్టింగ్‌లో ఉపయోగించిన కాంక్రీట్‌తో 27 కి.మీ పొడవైన రహదారిని నిర్మించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం 504 అడుగుల ఎత్తులో నిర్మితమవుతుందని విశ్వ ఉమియా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్పీ పటేల్ తెలిపారు. దీనిని ప్రపంచంలోనే 9వ అద్భుతంగా పరిగణిస్తారని అన్నారు. విశ్వ ఉమియా ధామ్ మొత్తం సనాతన ధర్మానికి ప్రతీక అని తెలిపారు. ఇది అన్ని వర్గాలకు ఒక ధామ్ గా నిలుస్తుందని తెలిపారు. మరోవైపు ప్రపంచపు అతి ఎత్తైన హిందూ ఆలయంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 700 అడుగుల ఎత్తైన వృందావన్ చంద్రోదయ మందిర్‌ను ఇస్కాన్ నిర్మిస్తోంది. ప్రస్తుతం అతి ఎత్తైన హిందూ టెంపుల్‌గా కర్ణాటకలో 249 అడుగుల మురుదేశ్వర్ ఆలయం ఉంది. దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురంగా ప్రసిద్ధి చెందింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?
ఫైబర్ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

