AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా

మమ్మీల పుట్టిల్లు ఈజిప్ట్ కాదు.. చైనా

Phani CH
|

Updated on: Sep 21, 2025 | 2:58 PM

Share

ఈజిప్ట్‌ రాజుల మమ్మీలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఈజిప్ట్‌ కన్నా ముందే చైనా, దక్షిణాసియా దేశాల్లో మృతదేహాలను భద్రపరిచేవారని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ స్మోక్‌ డ్రైయింగ్‌ మమ్మిఫికేషన్‌’అనే ఓ అరుదైన సైంటిఫిక్‌ ప్రక్రియ ద్వారా మమ్మీలను వారు భద్రపరచే వారని ఓ అధ్యయనంలో బయటపెట్టారు.

నిజానికి స్మోక్‌ డ్రైయింగ్‌ మమ్మిఫికేషన్‌ విధానం.. చిలీలో 7 వేల ఏళ్ల క్రితమే ఉందని , ఆ తర్వాత ఈజిప్ట్‌లో 4 వేల ఏళ్ల క్రితం నుంచి దీనిని వినియోగించి మమ్మిఫికేషన్ చేశారని పరిశోధనలో తేలింది. అయితే.. ఈ విధానం 12 వేల ఏళ్ల క్రితమే దక్షిణాసియాలో మొదలై ఆ తర్వాతే.. ఇతర దేశాలకు విస్తరించినట్లు తాజా పరిశోధనల ఆధారంగా అర్థమవుతోంది. స్మోక్‌ డ్రైయింగ్‌ మమ్మిఫికేషన్‌ విధానంలో శవాన్ని నులి వెచ్చని వేడి తగిలేలా మంట పైన కానీ దగ్గర్లో కానీ ఉంచేవారు. దీని వల్ల శరీరంలోని నీరంతా క్రమంగా ఆవిరైపోతుంది. దీంతో మృతదేహం కుళ్లిపోకుండా ఉంటుంది. తర్వాత మమ్మీగా దానిని చేసి.. భద్రపరచేవారని కాన్‌బెర్రా శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధారణ అయింది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు చైనా, వియత్నాం, ఇండోనేసియాల్లోని 11 ప్రాంతాల నుంచి సేకరించిన 54 మమ్మీలను పరిశీలించారు. పరిశోధనల వివరాలు ఇటీవల ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం.. ఆ మమ్మీలపై ఎక్కడా కాలిన గాయాలు లేవు. వేడికి కమిలిన గుర్తులు ఉన్నప్పటికీ.. లోపలి అవయవాలన్నీ యథాతథంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక మృతదేహాన్ని మమ్మీగా మార్చడానికి కొన్ని నెలలు పడుతుందని శాస్త్రవేత్తల అంచనా. వేటాడే జాతుల్లో మరణించిన వారు తిరిగి వస్తారనే నమ్మకాలు ఉండటం, తాము ఎప్పటికీ జీవించి ఉండాలనే మనిషి బలమైన కోరికే మమ్మీల వెనక ఉన్న బలమైన కారణాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రావణుడి అత్తారిల్లు మన దగ్గరే! మండోర్‌లో దశకంఠుడికి పూజలు

ప్రపంచంలోనే ఎత్తయిన ఉమియా దేవి ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే

టిక్కెట్ లేకుండా రైలు ఎక్కొచ్చు.. కానీ?

ఫైబర్‌ సప్లిమెంట్లతో సమస్యలు తప్పవు!

బుడిపెలున్న చేపను చూసారా