AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా? ఇలాంటి ప్రయోగాలు నేరమంటోన్న నెటిజన్లు

సమోసాలలో బంగాళదుంపలు ఉంటాయన్నది మనకు తెలుసు. బంగాళదుంపలు లేకపోతే సమోసాలు శుద్ధ వేస్ట్ అంటుంటారు. కానీ ఇప్పుడు మీరు చూసే సమోసాలలో..

Viral Video: ఇదో వెరైటీ సమోసా.. బంగాళదుంపకు బదులుగా ఏం వాడాడో తెలుసా? ఇలాంటి ప్రయోగాలు నేరమంటోన్న నెటిజన్లు
Samosa Viral Video
Follow us
Venkata Chari

| Edited By: Phani CH

Updated on: Dec 30, 2021 | 9:28 AM

Trending Video: సమోసా ఒక సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థం. మార్కెట్‌లో చాలా రకాల సమోసాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. సమోసా కూడా సరైన అల్పాహారంగా పేరుగాంచింది. దీనితో పాటు, జున్ను, బంగాళాదుంపల కాంబినేషన్ ఎంతో రుచికరంగా ఉంటుంది. మొన్నటి వరకు సమోసాలో బంగాళదుంపలు ఉంటాయన్నది మనకు తెలిసిందే. అలాగే బంగాళదుంప లేకుండా సమోసా అసంపూర్ణమని అంటారు. కానీ, ఇప్పుడు అదే బంగాళాదుంప సమోసాలో గులాబ్ జామూన్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి సమోసా తయారు చేస్తున్నాడని మీరు చూడవచ్చు. అయితే వాటిలో ఉంచేందుకు బంగాళాదుంప, సగ్గుబియ్యానికి బదులుగా గులాబ్ జామూన్ పెడుతున్నట్లు ఈ వీడియోలో చూడోచ్చు. ఆ ఆ తరువాత సాధారణ సమోసాల్లాగే నూనెలో వేయించాడు. కొంతమందికి ఇది వింతగా అనిపించినప్పటికీ ఈ వీడియోలో చూపించింది మాత్రం నిజం. స్వీట్ సమోసాల కాన్సెప్ట్ కొత్తది కాదు. చాక్లెట్ సమోసా పావ్, ఓరియో ఐస్ క్రీమ్ సమోసా కూడా ఇంతకు ముందు చూశాం. కానీ, ఇది మాత్రం కొత్త రకం సమోసానే అనండంలో సందేహం లేదు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వారి స్పందనలను కామెంట్ల ద్వారా ఇస్తున్నారు. ‘ఈ రోజు నేను పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాను. ఒక వ్యక్తి ఇలా ఎలా ఆలోచించగలడు’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, ‘ఈ రోజుల్లో రెస్టారెంట్లు, రోడ్‌సైడ్ షాపులు కస్టమర్‌లను రప్పించేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇది గులాబ్ జామూన్, సమోసా రెండింటికీ అవమానం’ అంటూ మరోక యూజర్ ఘటుగా కామెంట్ చేశాడు.

Mr. Dk అనే ఖాతా ద్వారా ఈ వీడియోను YouTubeలో పంచుకున్నారు. దీనికి వందల కొద్దీ లైక్స్, వ్యూస్ వచ్చాయి. అయితే చాలా మంది వినియోగదారులు దీనిని చూడటానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. అదే సమయంలో కొంత మంది దీనిని చెత్త ఆహారంగా పిలిస్తున్నారు. మరి ఈ వెరైటీ ఫుడ్‌కి మీ స్పందన ఏంటి?

Also Read: Viral Video: పిల్లాడు కాదు చిచ్చర పిడుగు.. 10 అడుగుల పైథాన్‌‌తో చెడుగు ఆడేసుకున్నాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

Viral Video: తాబేలు కారుపై జోరుగా షికారు .. రేసు కోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్..