Viral Video: పిల్లాడు కాదు చిచ్చర పిడుగు.. 10 అడుగుల పైథాన్‌తో చెడుగు ఆడేసుకున్నాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
Child Playing with Python: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో జంతువులు, సరిసృపాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Child Playing with Python: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో జంతువులు, సరిసృపాలకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా భారీ పైథాన్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా కొండచిలువలు మనుషుల జోలికి రావు. అలాగని మనుషులు నిర్లక్ష్యంగా ఉండటం సరికాదు. అలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ రెండేళ్ల చిన్నారి ఆటుకుంటున్న సందర్భంలో అక్కడికి ఓ భారీ కొండ చిలువ వచ్చింది. అది పాము అని, ప్రమాదకరమని ఆ చిన్నారికేం తెలుసు పాపం. తన దగ్గరకు వచ్చిన ఆ కొండచిలువతో హాయిగా ఆడుకుంటున్నాడు చిన్నారి. దాని తలను పట్టుకొని అటూ ఇటూ పడేస్తూ ఆడుతున్నాడు. అదేదో జారుడు బల్లలా దానిపైన పడుకొని జారుతున్నాడు. అది ఇంట్లోకి వెళ్లడానికి ప్రత్నిస్తుంటే దానిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఇదంతా చూస్తూ ఆ చిన్నారి తల్లిదండ్రులు వీడియో తీస్తున్నారు తప్ప ఆ పాము దగ్గరనుంచి కుర్రాడిని తీసుకెళ్లడంలేదు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను డిసెంబరు 29న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 30 సెకెన్ల నిడివి వున్న ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “ఇది బాధ్యత లేని వ్యవహార శైలి” అని ఓ యూజర్ అంటే.. ‘‘అలా వీడియో తీస్తూ కూర్చోకపోతే పిల్లాణ్ని అక్కడి నుంచి తీయొచ్చు కదా’’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Also read:
AP News: నా భర్త నాక్కావాలి.. బ్యానర్లతో నిరసనకు దిగిన భార్య.. అసలేమైందంటే..?
Oke Oka Jeevitham Teaser: ఆకట్టుకుంటున్న ఒకే ఒక జీవితం టీజర్.. శర్వానంద్ లుక్ అదిరిపోయిందిగా..