Viral Video: ఆయన ప్లాన్ మామూలుగా లేదుగా.. కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా ఏం చేశాడంటే.. వీడియో వైరల్‌..

| Edited By: Team Veegam

Sep 11, 2021 | 2:52 PM

Viral Video: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర..

Viral Video: ఆయన ప్లాన్ మామూలుగా లేదుగా.. కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా ఏం చేశాడంటే.. వీడియో వైరల్‌..
Follow us on

Viral Video: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు మారాయి. అయితే రెండు రోజులుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. గత వారం నుంచి భారీగానే కురిశాయి. వరదలకు భారీగా పంటనష్టం వాటిల్లింది. గత మూడు రోజుల కిందట ఉత్తర తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. దీంతో సిరిసిల్ల పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా నివాస ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇళ్ల ముందు ఉన్న వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే తన కారు వరద నీటిలో కొట్టుకుపోకుండా వినూత్నంగా ఆలోచించాడు ఒక వ్యక్తి. తన ఇంటిపై ఉన్న పిల్లర్లకు తాళ్లు కట్టి, కారును వేలాడదీశాడు. దీంతో వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహిస్తున్నా, అతడి కారు నీటిలో కొట్టుకుపోలేదు. ఈ ప్రాంతం వాసులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

భారీ వరదల కారణంగా కారు కొట్టుకుపోకుండా, దాన్ని భారీ తాళ్లతో కట్టి, పిల్లర్లకు వేలాడదీసినట్లు వీడియోలో కనిపిస్తోంది. యజమాని ఇంటి పైన కాంక్రీట్ స్తంభాలకు ఈ తాళ్లను బిగించారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి.. ‘రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శాంతినగర్ వద్ద ఒక కారును యజమాని ఇలా తాళ్లతో వేలాడదీశాడు. వరదలో కారు కొట్టుకుపోకుండా యజమాని ఈ ఏర్పాట్లు చేశాడు’ అని క్యాప్షన్ రాశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు కారు యజమానిని మేధావిగా పేర్కొన్నారు. ‘తాళ్లతో కారును రక్షించుకోవడం మంచి ఆలోచన’ అని ఒక యూజర్ కామెంట్ రాశాడు. భవిష్యత్తులో ప్రజలు తమ వాహనాలను టెర్రస్‌పై పార్క్ చేసుకోవాల్సి వస్తుందేమో అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. ‘థింక్ డిఫరెంట్’ అంటూ మరో యూజర్ ఈ వీడియోకు ఒక మీమ్‌ జత చేశాడు. అని రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

 

ఇవీ కూడా చదవండి: Dindi Project: డిండి అందాలను చూసోద్దాం రండి.. తన్మయత్వం చెందుతున్న పర్యాటకులు.. వీడియో

Viral Video: ఒకే దిశలో నాలుగు రైళ్లు.. వాహ్ అంటూ ఆశ్చర్యపోతోన్న జనం.. వైరలవుతోన్న వీడియో