పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి
పామును రెచ్చగొట్టడం ఎంత ప్రమాదకరమో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఒక వ్యక్తి నాగుపాము ముందు నిర్లక్ష్యంగా ‘నాగిన్ డ్యాన్స్ చేస్తూ నానా హంగామా చేశాడు. దాన్ని చేతుల్లోకి తీసుకొని మెడకు చుట్టుకొని దాన్ని ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరగబడిన పాము అతనిపై దాడి చేయడంతో అతగాడి తిక్క కుదిరింది.
అప్పటివరకు జోష్ గా ఉన్న సీన్ కాస్తా సీరియస్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి సన్‌గ్లాసెస్ ధరించి నాగుపాము ముందు ఫన్నీగా నాగినీ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. దాన్ని చేతిలో పట్టుకొని కింద పడేసి, మళ్లీ పట్టుకొని మెడలో వేసుకొని నానా హంగామా సృష్టించాడు. అయితే ఇలా చేస్తున్న సమయంలో పాము ఒక్కసారిగా అతన్ని కాటు వేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, ఆ యువకుడు ఏమీ జరగనట్లుగా దానితో ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు యువకుడికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. పాము కాటు వేయడంతో అతడి చేతికి తీవ్ర గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ షాకింగ్ వీడియోను ఓ యూజర్ తన X హ్యాండిల్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కింద ‘పాముతో ఆటలొద్దు అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘పాములు మీ అన్నదమ్ములు కావు… జీవిత విలువను అర్థం చేసుకోండి, ఇలా ప్రమాదాలతో ఆడుకోకండి‘ అని రాసుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్
30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం
బిగ్ అలర్ట్.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..
గూగుల్ తీసిన నగ్న ఫోటో.. కోర్టుకెళ్తే రూ.10 లక్షల నష్ట పరిహారం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

