నడి రోడ్డుపై బుస్సుమన్న నాగ పాము.. చూసిన జనాలు పరుగో పరుగు
పాములంటే అందరికీ భయమే. అందులోనూ నాగుపాములంటే పగపడతాయనే ఓ నమ్మకం ఉంది జనాల్లో. దీంతో నాగు పాము కనిపిస్తే చాలు భయంతో వణికిపోతారు. అలాంటిది నాగుపాము పడగవిప్పి దారికడ్డంగా నిలబడితే.. భయంతో గుండె ఆగినంత పనవుతుంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రజల కంట పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నడిరోడ్డుపై ప్రత్యక్షమైన నాగుపాము వాహనదారులకు చెమటలు పట్టించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం వన్య ప్రాణులకు పుట్టినిల్లు. గుట్టలు, పచ్చని తోటలతో నిత్యం కళకళలాడే ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు,కోతులు, జింకలు వంటి వన్య ప్రాణులు సందడి చేస్తూ ఉంటాయి. జిల్లాలోని, కవిటి మండలం, మధ్యపుట్టుగ గ్రామ శివారులో శుక్రవారం ఓ నాగుపాము హల్చల్ చేసింది. సుమారు 7అడుగుల పొడవున్న నాగరాజు నడి రోడ్డుపై పడగవిప్పి అటూ ఇటూ చూస్తూ అటుగా వెళ్ళే వారిని భయాందోళనకు గురిచేసింది. సుమారు 10నిముషాల పాటు రోడ్డుపై ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా నిరీక్షించి ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం సృష్టించింది. వర్షాకాలం ఆరంభం కావటంతో పొదల్లో వుండే నాగుపాము రోడ్డుపైకి వచ్చేసరికి జనాలు హడలిపోయారు. జనాలను చూసిన నాగుపాము నాకు కావలసినవారెవరూ వారిలో లేరు.. అన్నట్టుగా కాసేపటికి పక్కనే వున్న తోటల్లోకి నెమ్మదిగా వెళ్లిపోయింది. దీంతో అంతవరకు రోడ్డుకు రెండువైపుల ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము వెళ్లిపోవడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏం సినిమా రా బాబూ.. రూ. 17,400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్
పన్ను చెల్లింపుదారులకు అదిరేపోయే శుభవార్త
KohiNoor: కోహినూర్ విలువ ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
భార్యాభర్తల కోసం బెస్ట్ పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్..! రూ.13 లక్షలు మీ సొంతం
దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. ఆ తర్వాత
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

