Viral Video: ఢిపరెంట్ బైక్‌తో రివర్స్ రైడింగ్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

|

Sep 03, 2021 | 7:28 PM

ఒక బైకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బైక్ చూడ్డానికి చాలా ఢిపరెంట్‌గా ఉండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Viral Video: ఢిపరెంట్ బైక్‌తో రివర్స్ రైడింగ్..  వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Biker
Follow us on

Viral Video: ఈ రోజుల్లో విభిన్నంగా ఏదైనా చేయాలనుకునే వ్యక్తులకు సోషల్ మీడియా గొప్ప వేదికగా మారింది. వారి ప్రతిభతో రాత్రికి రాత్రే స్టార్స్‌లా మారిపోతున్నారు. కొందరు పాడటం, డ్యాన్స్ చేయడం, వంట చేయడం వంటి ప్రత్యేక ప్రతిభతో పేరు తెచ్చుకుంటారు. మరికొందరు వింత విన్యాసాలు చేస్తూ స్టార్స్‌గా ఎదుగుతుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా. ఓ వ్యక్తి బైక్ నడుపుతున్న తీరును చూసి, నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోలో బైక్‌ కూడా చాలా ఢిపరెంట్‌గా కనిపించింది. ఇంకేముంది నెట్టింట్లో ఈ వీడియో ప్రస్తుతం దూసుకపోతోంది.

ఈ వీడియోలోని వ్యక్తి కొద్దిగా భిన్నంగా ఉన్నాడు. బైక్‌ను వెనుక నుంచి నడుపుతూ నెట్టింట్లో దూసుకపోతున్నాడు. బైక్‌ను ముందు హ్యాండిల్ ద్వారా పట్టుకోకుండా, హ్యాండిల్ దగ్గర కూర్చొని బైక్ రైడింగ్ చేశాడు. ఈ వ్యక్తి శైలి ప్రత్యేకంగా ఉండడంతో నెటిజన్లు కూడా ఆసక్తిగా ఈ వీడియోను తిలకిస్తున్నారు. పెట్రోల్ బంక్ వద్ద గుండ్రంగా తిరుగుతూ రివర్స్‌లో బైక్ నడుపుతున్నాడు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో enddd_janta అనే పేరుతో షేర్ చేశారు. ఈ వ్యక్తి బైక్ రైడింగ్ శైలిని సోషల్ మీడియాలో తెగ ఇష్టపడుతున్నారు. అయితే, ఈ వీడియో ఎక్కడిదనే సమాచారం మాత్రం లేదు. మీరు మాత్రం ఇలా బైక్‌ను నడవొద్దు సుమా.

Also Read:

Viral Video: బంగారు వడ పావ్‌.. కావాలా నాయనా..?? రేట్ ఎంతో తెలుసా..?? వీడియో

Viral Video: తలపై పుచ్చకాయతో పవర్‌ఫుల్ స్టెప్పులు.. మనోడి ప్రతిభకు ఫిదా అవుతోన్న నెటిజన్లు

Bullet Bandi Song: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ బండి పాటతో ట్రీట్మెంట్.. వైరల్ వీడియో