Lionel Messi: స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాను వదిలి వెళ్తానని ఊహించలేదంటూ స్పానిష్ ఫుట్‌డాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. బార్సిలోనాతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని ఆదివారం తెంచుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు ఫేర్‌వెల్ సందర్భంగా మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. కెరీర్ అయిపోయేంత వరకు బార్సిలోనాతోనే ఉండాలని అనుకున్నానని, కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వస్తుందని తెలిపాడు. మరలా నేను స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాలోకి తిరిగి వస్తానంటూ పేర్కొన్నాడు. తన కెరీర్ బార్కాలోనే మొదలైందని, ఇక్కడి నుంచే చాలా నేర్చుకున్నానని వెల్లడించాడు. నేడు ఈ స్థాయిలో ఉండేందుకు కారణం బార్కానే అని లియోనల్ మెస్సీ కన్నీటి పర్వంతమయ్యాడు.
కాగా, స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనా ఆర్థిక పరిస్థితి పడిపోవడంతో మెస్సీతో కాంట్రాక్ట్ ముగిస్తున్నట్లు గురువారం బార్సిలోనా ప్రకటించిన విషయం తెలిసిందే. మెస్సీ 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే మ్యాచులు ఆడారు. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు. 2000 సంవత్సరంలో 13 ఏళ్ల వయసులో ఈ క్లబ్ తరుపున మెస్సీ కెరీర్ ప్రారంభమైంది.
అయితే మెస్సీ 17 ఏళ్ల వయసులో 2004 నుంచి మ్యాచులు ఆడడం మొదలు పెట్టాడు. మొత్తం 17 సీజన్లు ఆడాడు. ఈ సమయంలోనే క్లబ్ తరఫున 778 మ్యాచ్‌లు ఆడి 672 గోల్స్ సాధించాడు. మెస్సీ క్లబ్‌ను వీడటంతో చాలా నష్టం వాటిల్లనుంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నష్టాన్ని పూరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మెస్సీ హయంలోనే ఎఫ్‌సీ బార్సిలోనే ఎన్నో టైటిళ్లను సొంతం చేసుకుంది. లా లిగా-10, కోపా డెల్ రే-7, ఛాంపియన్స్ లీగ్-4, ఫుట్‌బాల్ వరల్డ్ కప్-3లను సాధించింది. మెస్సీ 20 సార్లు టాప్ స్కోరర్‌గా నిలిచి పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 6 సార్లు బాల్లన్ డీ ఆర్‌ను అందుకున్న ఆటగాడిగా మెస్సీ పేరుగాంచాడు. అయితే, మరో స్టార్ స్ట్రైకర్ సెర్గియో కూడా బార్సిలోనాను వీడనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
This is the word of Leo #Messi: pic.twitter.com/k0btQ7k1py
— FC Barcelona (@FCBarcelona) August 8, 2021
Also Read: IND vs ENG 1st Test Match: టీమిండియా గెలుపును అడ్డుకున్న వర్షం.. డ్రా గా ముగిసిన తొలి టెస్ట్..