పప్పు గుత్తిగా జేసీబీ.. వామ్మో.. ఇలా కూడా వండుతారా
ఏవైనా పండుగలు జాతరలు జరిగేటప్పుడు ఊరూవాడా అందరికీ భోజనాలు పెడుతుంటారు. అలాంటప్పుడు పెద్దమొత్తంలో వంటలు చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు చేస్తారు. మరి.. తక్కువ టైంలో వేలాదిమందికి వండివార్చాలంటే చాలా కష్టం. పైగా, ఇలాంటి సందర్భాల్లో శుచీ శుభ్రతా పాటిస్తారో లేదోననే అనుమానంతో చాలామంది భోజనం చేయటానికి కాస్త వెనకాడుతూ ఉంటారు.
అయితే.. వీరి అనుమానాలను నిజం చేసేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అక్కడ ఓ జాతరలాంటి కార్యక్రమం ఏదో జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేలాదిమందితో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. వారందరికీ భోజనాల ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు నిర్వాహకులు. ఈ ప్రదేశంలో పెద్దమొత్తంలో సరుకులు కూడా ఉన్నాయి. ఆరుబయట ఓ భారీ కుండలో పప్పు వండుతున్నారు. ఆ పప్పును కలపాలంటే ఓ పెద్ద గరిటె కావాలి. అయితే నిర్వాహకులు పప్పును కలిపేందుకు ఏకంగా ఓ జేసీబీని తీసుకొచ్చారు. ఆ జేసీబీ ఆ పప్పును కలుపుతోంది. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వారు వంట చేస్తున్నారా.. ఏదైనా నిర్మాణపనులు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అంత పెద్ద మొత్తంలో వంటచేయడానికి ఈ పద్ధతి సులువే అయినా.. పరిశుభ్రత విషయంలో ఆందోళన చెందడం సహజం అని కొందరు కామెంట్ చేశారు. అయితే ఆ యంత్రాన్ని ముందే శుభ్రపరిచి ఉంటారని కొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ పోగొట్టుకోవడంతో మొదలైన ప్రేమ కథ.. 32 ఏళ్ల వయసు తేడాతో ఒక్కటైన జంట
కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందంటే
ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే
Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్
యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

