కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందంటే
భారీ సైజులో ఉండే కొండచిలువను చూస్తే.. ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. అలాంటిది.. అది కోపంతో దాడిచేస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించటమే కష్టం. సాధారణంగా దాని బారిన పడిన ఎర.. తప్పించుకోవటం అసాధ్యమనే చెప్పాలి. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామాల్లో ఇటీవల కొండచిలువలు జనావాసాల్లోకి చొరబడుతూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టున రోడ్డుకు అడ్డంగా పడుకున్న కొండ చెలువను చూసి.. గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వ్యక్తి దానిని అక్కడినుంచి తరిమి వేసే క్రమంలో దానిపై కర్రతో గట్టిగా కొట్టాడు. అంతే.. అది ఒక్కసారిగా ఆ మనిషి మీద ఎగబడి దాడిచేయటానికి ప్రయత్నించింది. ఈ భయంకరమైన సీన్ చూసి.. అక్కడున్న వారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అయితే.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. యానాం నుంచి జొన్నాడ వెళ్లే గోవలంక వద్ద ఏటిగట్టు రోడ్డుపై రాత్రి వేళ ఓ భారీ కొండ చిలువ కనిపించింది. రోడ్డుపై దారికి అడ్డంగా ఎటూ కదలకుండా అలానే ఉండిపోయింది. దీంతో, ఆ దారిన పోతున్న స్థానికులంతా దానిని చూసి.. భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్థానికులు దానిపై కర్రలతో దాడి చేయగా అది ఒక్కసారిగా తిరగబడింది. దెబ్బకు అక్కడున్న వారంతా పరుగులు తీశారు. అనంతరం కొండచిలువ ప్రక్కనే ఉన్న పొదలలోకి వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే
Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్
యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

