Viral Video: అడవుల్లో, పొదల్లో ఉండే పాములు, కొండచిలువలు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి వస్తుంటాయి. పాములంటేనే జనాలు జంకుతుంటారు. ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లోనే దూరి అందరిని హడలెత్తించింది. ఈ ఘటన యూఎస్‌లోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇంట్లో దూరిన కొండ చిలువ ఏకంగా ఇంట్లోని సీలింగ్‌లోకి దూరిపోయింది. అయితే కొండచిలువను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. ఆ భారీ కొండ చిలువను పట్టుకునేందుకు వచ్చిన రెస్క్యూ సిబ్బందినే అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. టోపీ చూపిస్తూ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. కరిచేందుకు బుసలుకొట్టింది. చివరికి దానిని పట్టుకునే వెళ్లిపోయారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు జడుసుకుంటున్నారు. వామ్మో ఇంతపెద్ద కొండచిలువనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా అప్పుడప్పుడు పాములు ఇళ్లల్లోకి వస్తుంటాయి. కానీ ఇంత పెద్ద కొండ చిలువ రావడంతో ఇంట్లో ఉన్నవారంతా వణికిపోయారు. ఎటు నుంచి ఎలా వచ్చిందో ఈ కొండచిలువ కొంత సేపు అందరిని హడలెత్తించింది. రెస్క్యూ టీమ్ సిబ్బంది చేసిన సహసానికి పలువురు ప్రశంసిస్తున్నారు.