పెళ్లి ఊరేగింపులో గుర్రం స్టెప్పులు.. అంతలోనే విషాదం.. వీడియో

పెళ్లి ఊరేగింపులో గుర్రం స్టెప్పులు.. అంతలోనే విషాదం.. వీడియో

Samatha J

|

Updated on: Feb 02, 2025 | 1:13 PM

ఓ ఇంట్లో సందడిగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బంధుమిత్రులతో పెళ్లి వేదిక కోలాహలంగా ఉంది. కానీ అంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో భాగంగా గుర్రం జోరుగా డ్యాన్స్‌ చేస్తూ ఉంది. అందరూ గుర్రం అదిరిపోయే స్టెప్పులేస్తుందని నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ మాంచి ఊపుగా స్టెప్పులేస్తున్న గుర్రం ఒక్కసారిగా వెనుక కాలు విదిలించింది.

 అంతే నిండుప్రాణం బలైంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జనవరి 27న రాత్రి వేళ హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఠాకూర్ చౌక్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. బ్యాండ్‌ మేళం మ్యూజిక్‌కు అనుగుణంగా ఊరేగింపుకు వచ్చిన గుర్రం డ్యాన్స్‌ చేసింది. ఇంతలో గుర్రం వెనుక ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వచ్చారు. గుర్రం అకస్మాత్తుగా వెనుక కాలుతో చిన్నారిని తన్నింది. దీంతో అక్కడున్న ఆ బాలుడి తలకి గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!

రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో

ఖర్జూరంతో అరటిపండును కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

భూమి తిరగడాన్ని చూశారా? వీడియో

Published on: Feb 02, 2025 01:13 PM