Viral video: అమ్మాయి బైక్ రైడింగ్..! తన్ను తన్నింది ఏకంగా అదే ఊడిపడింది..ఫన్నీ వీడియో వైరల్..
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. పశుపక్షాదులు, చిన్నపిల్లలకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. పశుపక్షాదులు, చిన్నపిల్లలకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే వాటినిన ఎన్నిసార్లు చూసినా, మళ్లీ మళ్లీ చూస్తుంటారు..మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడపిల్లల వీడియోలు చాలా మంది నెటిజన్లకు ఎక్కువగా నచ్చుతుంటాయి. తాజాగా, బైక్ నడుపుతున్న ఓ అమ్మాయి వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఈ వీడియో లో అమ్మాయి చేసిన పని చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్‌గా మారిన వీడియోలో ఓ అమ్మాయి ఓ బైక్ ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఎన్నిసార్లు కిక్ ను కొట్టినా బైక్ స్టార్ట్ కావడం లేదు. దీంతో ఆమె మరో రెండు సార్లు ప్రయత్నించింది. అయినా బైక్ స్టార్ట్ కాలేదు. ఆమె మరో సారి కొంచం గట్టిగా కిక్ కొట్టేసరికి ఏకంగా కిక్ రాడ్ కాస్త ఊడి పడిపోయింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
View this post on Instagram
మామూలుగా అయితే, కిక్ రాడ్ రెండు సార్లు తన్నితే విరిగి పడేంత బలహీనంగా ఉండదు. కానీ, ఈ అమ్మాయి తన్నిన తన్నులకు కిక్ రాడ్ కూడా ఊడి పడిందంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు, కామెంట్లతో వీడియోను ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మార్చేశారు.