Viral: మంచివాడే అనుకునేలోపే పాడుపని.! కోతికి ఆహరం పెడుతూనే దారుణం.
ప్రకృతిలో మానవాళితోపాటు పశుపక్ష్యాదులు కూడా జీవనం సాగిస్తున్నాయి. వీరి జీవన విధానంలో పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి సాగుతుంది. అవును పశుపక్ష్యాదులు ఉంటేనే మానవాళి మనుగడ ముందుకు సాగుతుంది. అందుకే అనాదికాలం నుంచి మనిషికి జంతువులకు మధ్య అవినాభావ సబంధం ఉంది. ఈక్రమంలోనే పెట్స్ రూపంలో శునకాలు, ఆవులు, ఇతర జంతువులు మనిషితో కలిసి జీవిస్తున్నాయి. చాలామందికి మూగజీవులంటే చాలా ప్రేమ ఉంటుంది.
ప్రకృతిలో మానవాళితోపాటు పశుపక్ష్యాదులు కూడా జీవనం సాగిస్తున్నాయి. వీరి జీవన విధానంలో పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి సాగుతుంది. అవును పశుపక్ష్యాదులు ఉంటేనే మానవాళి మనుగడ ముందుకు సాగుతుంది. అందుకే అనాదికాలం నుంచి మనిషికి జంతువులకు మధ్య అవినాభావ సబంధం ఉంది. ఈక్రమంలోనే పెట్స్ రూపంలో శునకాలు, ఆవులు, ఇతర జంతువులు మనిషితో కలిసి జీవిస్తున్నాయి. చాలామందికి మూగజీవులంటే చాలా ప్రేమ ఉంటుంది. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావించి ప్రేమను పంచుతారు. కొందరు మాత్రం మూగజీవుల పట్ల తమ పైశాచికాన్ని చూపిస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కోతికి ఆహారం అందిస్తూ ఉన్నట్టుండి కోతిపై దాడి చేసాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఓ వ్యక్తి లోయవద్ద పర్యటనకు వెళ్లాడు. అక్కడ లోయ పక్కన రెయిలింగ్‌పైన ఓ కోతి కూర్చుని ఉంది. సదరు వ్యక్తి కోతిని చూడగానే ఆహారం పెట్టుకుని దానిదగ్గరకు వెళ్లాడు. కోతికి ఎంతో ప్రేమతో ఆహారం పెట్టాడు. ఆకలితో ఉన్న కోతి ఎంతో ఆతృతగా ఆహారాన్ని తింటూ ఉంటుంది. ఇంతలోనే అతను దారుణానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కోతిని చేత్తో గట్టిగా కొట్టాడు. పాపం.. కోతి ఎగిరి లోయలో పడిపోయింది. వెంటనే తేరుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారుల వరకూ చేరింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సదరు వ్యక్తిని గుర్తించేందుకు విచారిస్తున్నామని, అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహారం పేరుతో ఇతడు చేసిన పని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.. అంటూ కొందరు, ఆహారం తినే సమయంలో ఇలా చేయడం దారుణం.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఇండోర్‌లో జరిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.