
Viral Video: వంట చేయడం కూడా ఒక కళ అని చెబుతుంటారు. రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి ఇతరులను మెప్పించాలని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసం ప్రయత్నిస్తుంటారు కూడా. అయితే కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే కొన్ని తప్పులు జరుగుతుంటాయి. వంటలు చేస్తున్న సమయంలో వేయాల్సిన వాటి కంటే ఎక్కువ మోతాదులో ఇంగ్రీడియన్స్ వేస్తుంటాం. చేయి జారీ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కారం ఎక్కువైతే నిమ్మకాయ రసం వేసి కవర్ చేయొచ్చు, ఉప్పు ఎక్కువైతే నీరు పోసి కవర్ చేయొచ్చు. మరి నూనె ఎక్కువైతే పరిస్థితి ఏంటి.? కొన్ని సందర్భాల్లో అంచనాకు మించి నూనె వంటల్లో వేసి తర్వాత నోరు కరుచుకుంటాం. ఇలా మీరూ కూడా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా.? అయితే వంటలో ఎక్కువైన నూనెను తొలగించడానికి ఓ ట్రిక్ ఉందండోయ్.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ఓ వ్యక్తి వంట చేస్తున్నాడు. ఇదే సమయంలో ఎక్కువైన నూనెను తొలగించడానికి అతను ఐస్‌ను ఉపయోగించాడు. వంటలో ఎక్కువైన నూనెనంతా ఒక పక్కకు అని.. బంతి ఆకారంలో ఉన్న ఐస్‌ను ఆ నూనెకు అద్దగానే, ఆ నూనె ఐస్‌కు పొరలా అతుక్కుపోతుంది. అనంతరం ఐస్‌ను పక్కకు తీసి స్పూన్‌తో ఐస్‌ను టచ్ చేయగానే నూనె పొరలా వచ్చేస్తుంది. ఇలా వంటలో ఎక్కువైన నూనెన్ సింపుల్‌గా తీసేయొచ్చన్నమాట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ సింపుల్ ట్రిక్‌ను మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
Using ice to remove the oil pic.twitter.com/EiIGv4vmUo
— Time For Knowledge (24×7) (@24hrknowledge) August 18, 2021
Also Read: వర్మ, బండ్ల అండ్ అదర్స్…! ఈ కంపెనీలో మరో రెండు పేర్లు చేరిపోయాయా..?
Bumper Offer: వెరైటీ బంపర్ ఆఫర్.. ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకే నెల జీతం బోనస్.. ఎక్కడో తెలుసా..?