విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన చక్రం.. ఆ తర్వాత ??

విమానం టేకాఫ్ చేస్తుండగా ఊడిపోయిన చక్రం.. ఆ తర్వాత ??

Phani CH

|

Updated on: Mar 12, 2024 | 12:54 PM

ఇటీవల విమానాల్లో తరచూ ఏదొక ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ ఫ్లైట్‌ లో మంటలు చెలరేగాయి.పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా టేకాఫ్‌ చేస్తుండగా విమానం చక్రం ఊడిపోయిన ఘటన లాస్‌ ఏంజిలిస్‌ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జపాన్‌కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ చేసి

ఇటీవల విమానాల్లో తరచూ ఏదొక ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ ఫ్లైట్‌ లో మంటలు చెలరేగాయి.పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా టేకాఫ్‌ చేస్తుండగా విమానం చక్రం ఊడిపోయిన ఘటన లాస్‌ ఏంజిలిస్‌ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జపాన్‌కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం టేకాఫ్ చేసిన కొన్ని క్షణాలకే ల్యాండింగ్ గేర్‌లో ఎడమవైపు ఉన్న చక్రాల్లో ఒకటి ఊడి కిందపడిపోయింది. దీంతో, వెంటనే ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా లాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేశారని వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటరి మహిళలకు గుడ్‌ న్యూస్‌.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం

వంట గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.100 తగ్గింపు

తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారా ?? అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే

రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా

Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’