రూ.12,000 కోట్ల విలువ చేసే.. మానవ వెంట్రుకల అక్రమ రవాణా
మీరు హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఏమవుతుందో మీకు తెలుసా? విదేశాల్లో భారతీయుల వెంట్రుకలకు భలే డిమాండ్ ఉంది. దీంతో వెంట్రుకల అక్రమ రవాణా జరుగుతోంది. మన దేశం నుంచి మానవ వెంట్రుకలను కొనుగోలు చేసే దేశాల్లో చైనా ముందు స్థానంలో ఉంది. తాజాగా ఈడీ అధికారులు తెలంగాణలో 11,793 కోట్ల రూపాయల మానవ వెంట్రుకల అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. చైనాతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు భారతదేశ సరిహద్దుల
మీరు హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ ఏమవుతుందో మీకు తెలుసా? విదేశాల్లో భారతీయుల వెంట్రుకలకు భలే డిమాండ్ ఉంది. దీంతో వెంట్రుకల అక్రమ రవాణా జరుగుతోంది. మన దేశం నుంచి మానవ వెంట్రుకలను కొనుగోలు చేసే దేశాల్లో చైనా ముందు స్థానంలో ఉంది. తాజాగా ఈడీ అధికారులు తెలంగాణలో 11,793 కోట్ల రూపాయల మానవ వెంట్రుకల అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. చైనాతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు భారతదేశ సరిహద్దుల మీదుగా మానవ వెంట్రుకలను అక్రమంగా తరలించిన కేసును ఈడీ విచారిస్తోంది. ఈ మానవ వెంట్రుకలను హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల మీదుగా అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. మానవ వెంట్రుకల అక్రమ రవాణాకు సంబంధించి 2021లోనే హైదరాబాద్‌కు చెందిన నైలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పాత్రను గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. వీరు బినామీ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ కోడ్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gaami: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న ‘గామి’
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. పార్లమెంట్‌కు రైతు బిడ్డ ??
టోపీలు కూడా మార్చుకున్నారు.. ఇక నెక్ట్స్ పెళ్లే అనుకుంట భయ్యా
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

