డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి

డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి

Phani CH

|

Updated on: May 09, 2023 | 8:41 PM

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ సిటీలో పొరుగింట్లో ఉంటున్న ఓ వృద్ధుడు చనిపోతే.. ఆ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడో ఓ ప్రబుద్ధుడు. దాదాపు రెండేళ్ల పాటు ఫ్రీజర్ లోనే ఉంచిన విషయం బయటపడడంతో పోలీసులు కేసు పెట్టారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడని ఆరోపిస్తూ..

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ సిటీలో పొరుగింట్లో ఉంటున్న ఓ వృద్ధుడు చనిపోతే.. ఆ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడో ఓ ప్రబుద్ధుడు. దాదాపు రెండేళ్ల పాటు ఫ్రీజర్ లోనే ఉంచిన విషయం బయటపడడంతో పోలీసులు కేసు పెట్టారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడని ఆరోపిస్తూ నిందితుడిని జైలుకు పంపారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. వృద్ధుడి పెన్షన్ కోసమే నిందితుడు ఈ పని చేశాడని తేలింది. దీంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. బర్మింగ్ హామ్ లో 71 ఏళ్ల జాన్ వెయిన్ రైట్ నివసించేవారు. పొరుగింట్లో డేమియన్ జాన్సన్ తో స్నేహం పెంచుకున్నారు. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో 2018లో వెయిన్ రైట్ కన్నుమూశారు. వెయిన్ రైట్ కోసం వచ్చే బంధువులు ఎవరూ లేకపోవడంతో జాన్సన్ ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడు. వెయిన్ రైట్ బతికే ఉన్నట్లు అందరినీ నమ్మిస్తూ ఆయనకు నెల నెలా వచ్చే పెన్షన్ కాజేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రేజీ సాంగ్‌కు మెట్రో సిబ్బంది హుషారైన స్టెప్పులు..

ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు

నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. హగ్గులు.. ముద్దులు..

ఈమె వేసుకున్న జీన్స్‌ ప్యాంట్‌ ఉతికి 18 ఏళ్లు అయిందట.

Prabhas Adipurush Trailer: అదిరిపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. విజువల్‌ ఎఫక్ట్స్ నెక్స్ట్ లెవల్