AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు

ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు

Phani CH
|

Updated on: May 09, 2023 | 8:38 PM

Share

ఫోన్లు లేదా ఇతర వస్తువులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినప్పుడు సబ్బులు, రాళ్లు రావడం మనం ఇప్పటివరకు చూశాం. కానీ తమిళనాడులో వెన్నులో వణుకుపుట్టే ఘటన జరిగింది. వచ్చిన పార్సిల్‌ ఓపెన్‌ చేస్తే గుండె ఆగినంత పనయ్యయింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కుక్కర్‌ ఆర్డర్ చేశాడు.

ఫోన్లు లేదా ఇతర వస్తువులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినప్పుడు సబ్బులు, రాళ్లు రావడం మనం ఇప్పటివరకు చూశాం. కానీ తమిళనాడులో వెన్నులో వణుకుపుట్టే ఘటన జరిగింది. వచ్చిన పార్సిల్‌ ఓపెన్‌ చేస్తే గుండె ఆగినంత పనయ్యయింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కుక్కర్‌ ఆర్డర్ చేశాడు. తీరా పార్సిల్ వచ్చాక దాన్ని ఓపెన్‌ చేసి చూస్తే లోపల మనిషి పుర్రె ఉంది. అందులోకి మనిషి పుర్రె ఎలా వచ్చిదో తెలియక ఆర్డర్ పెట్టిన వ్యక్తి షాకైపోయాడు. పైగా ఆ పుర్రెకు రక్తం మరకలు ఉడంటంతో అతడు దిగ్భ్రాంతికి లోనయ్యాడవు. ఎవరు ఈ పని చేసింది.. పార్సిల్‌లో వస్తువు మార్చి పుర్రెను పంపించింది ఎవరు అనేది మిస్టరీగా మారింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు మహమ్మద్‌ ఖాసిం. తంజావూర్‌ జిల్లాలోని తిరువయ్యూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కొరియర్‌ ఇంటికి వచ్చిన టైమ్‌లో పనిమనిషి తప్ప ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొరియర్‌ బాయ్‌ దాన్ని ఆమెకు ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆ పార్సిల్‌ వచ్చిన కాసేపటికే అందులోంచి దుర్వాసన వస్తుండడంతో వెంటనే తెరిచి చూశారు. తీరా చూస్తే అందులో పుర్రె కనిపించడంతో అంతా షాక్‌కి గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. హగ్గులు.. ముద్దులు..

ఈమె వేసుకున్న జీన్స్‌ ప్యాంట్‌ ఉతికి 18 ఏళ్లు అయిందట.

Prabhas Adipurush Trailer: అదిరిపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. విజువల్‌ ఎఫక్ట్స్ నెక్స్ట్ లెవల్