లక్నోలో పోకిరి సినిమా సీన్ రిపీట్.. నెట్టింట వీడియో వైరల్
దేశంలో ఆడ పిల్లలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, లైంగిక వేధింపుల పట్ల రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా లక్నోలో పోకిరి సినిమాసీన్ రిపీట్ అయింది.
దేశంలో ఆడ పిల్లలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, లైంగిక వేధింపుల పట్ల రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా లక్నోలో పోకిరి సినిమాసీన్ రిపీట్ అయింది. సదర్ ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్ధిని వెంబడించి వేధింపులకు గురి చేసాడు ఓ హెడ్ కానిస్టేబుల్ అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆ పోలీసును నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఈ వీడియోలో ఓ విద్యార్ధిని సైకిలుపై స్కూలుకు వెళ్తోంది. పోలీస్ అని రాసిఉన్న స్కూటీపై హెల్మెట్ ధరించి ఉన్న కానిస్టేబుల్ షాదత్ అలీ ఆ విద్యార్ధిని వెంబడిస్తూ ఆమెను వేధిస్తున్నాడు. ఇదంతా వారి వెనుకే ద్విచక్రవాహనంపై వస్తున్న మరో మహిళ, ఓ యువకుడు వీడియో తీశారు. కొంత దూరం వెళ్లాక మహిళ ఆ కానిస్టేబుల్‌ను ఆపి, ఆ అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని నిలదీసింది. అతని ఫోన్ నెంబర్, బైక్ నెంబర్ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇది ఎలక్ట్రిక్ బైక్ అని, నెంబరు లేదని చెప్పాడు. మహిళ ప్రతిరోజూ ఇలా అమ్మాయిలను ఎందుకు వెంబడిస్తున్నావని అతన్ని నిలదీసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి
క్రేజీ సాంగ్‌కు మెట్రో సిబ్బంది హుషారైన స్టెప్పులు..
ఆన్‌లైన్‌లో కుక్కర్ ఆర్డర్ చేస్తే.. పుర్రె పంపించారు
నడిరోడ్డుపై రెచ్చిపోయిన అమ్మాయిలు.. హగ్గులు.. ముద్దులు..
ఈమె వేసుకున్న జీన్స్ ప్యాంట్ ఉతికి 18 ఏళ్లు అయిందట.