Leopards Death: ఒకే రోజు 2 చిరుతలు మృతి.. అసలు చంపిందెవరు..? వీడియో..
శ్రీసత్యసాయి జిల్లాలో చిరుతల మృతి కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో రెండు చిరుతల మృత్యువాత పడటం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు చిరుతలు ఒకే చోట చనిపోవడంపట్ల ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మడకశిర మండలం మెలవాయి శివారులో ఒక చిరుత మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలాల్లో ఆగస్ట్ 16న అటవీశాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని గుర్తించారు. కొన్ని గంటల వ్యవధిలోనే..
శ్రీసత్యసాయి జిల్లాలో చిరుతల మృతి కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో రెండు చిరుతల మృత్యువాత పడటం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు చిరుతలు ఒకే చోట చనిపోవడంపట్ల ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మడకశిర మండలం మెలవాయి శివారులో ఒక చిరుత మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలాల్లో ఆగస్ట్ 16న అటవీశాఖ అధికారులు చిరుత మృతదేహాన్ని గుర్తించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆగస్ట్ 17న అదే ప్రాంతంలో పొలానికి ఆనుకొని ఉన్న కొండలో మరో చిరుత మృతదేహాన్ని అటవీ సిబ్బంది కనుగొన్నారు. చిరుత మృతదేహం ప్రక్కన ఒక మేక కళేబరం కూడా అధికారులు స్వాదీనం చేసుకొన్నారు. చనిపోయిన చిరుతల వయసు 18 నుంచి 24 నెలలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. చుట్టుప్రక్కల గ్రామాలలో చిరుతలు తరచుగా మేకల మందలపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. చిరుతల బెడద నుండి రక్షించుకోవడానికి మేకల యజమానులు చిరుతలపై విషప్రయోగం చేసారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు చిరుతల మృతదేహాలపై గాయాలు లేకపోవడంపై దీనికి మరింత బలం చేకూరుస్తోంది. మరోవైపు ఇదే పరిసరాల్లో మరో చిరుత ఉండచ్చనే అటవీ అధికారుల భావిస్తున్నారు. జిల్లా ఫారెస్ట్ సిబ్బంది కొండ చుట్టుప్రక్కల గాలింపు చేపట్టారు. వరుస చిరుత మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి…
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...