Kidnap Video: సినీ ఫక్కీలో కిడ్నాప్.. ఛేజ్ చేసిన పోలీసులు షాక్..! వీడియో వైరల్..

Kidnap Video: సినీ ఫక్కీలో కిడ్నాప్.. ఛేజ్ చేసిన పోలీసులు షాక్..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Aug 19, 2023 | 7:42 PM

నడిరోడ్డుపై సినీ ఫక్కీలో ఓ యువకుడని కిడ్నాప్ కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో అందరూ చూస్తుండగానే.. యువకుడిపై దాడి చేసిన దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలో దిగిన పోలీసులు సినిమాలో సీన్ లాగే.. కారును వెంబడించి ఛేజ్ చేశారు. కిడ్నాప్‌కు గురైన యువకుడిని రక్షించి నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నడిరోడ్డుపై సినీ ఫక్కీలో ఓ యువకుడని కిడ్నాప్ కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో అందరూ చూస్తుండగానే.. యువకుడిపై దాడి చేసిన దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలో దిగిన పోలీసులు సినిమాలో సీన్ లాగే.. కారును వెంబడించి ఛేజ్ చేశారు. కిడ్నాప్‌కు గురైన యువకుడిని రక్షించి నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యువకుడు కిడ్నాప్ సంచలంగా మారింది. గంపలగూడెం మండలం వినగడపకు చెందిన దిలీప్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్‌ల వల్ల అప్పులపాలైన దిలీప్.. ఈజీ మనీ కోసం కొత్త స్కెచ్ వేశాడు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి యువకులకు ఉద్యోగాలిస్తామని ఆశచూపాడు. దాదాపు 45 లక్షల రూపాయల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్నాక ఉద్యోగాలు ఇప్పించకుండా దిలీప్ తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ డబ్బులు తిరిగిచ్చేయమని యువకులు ఒత్తిడి తీసుకువచ్చారు. దిలీప్ ముఖం చాటేస్తుండటంతో.. పక్కా ఫ్లాన్ చేసిన కొందరు బాధితులు దిలీప్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కిడ్నాప్ కేసును చేధించినట్లు వెల్లడించారు. నలుగురు యువకులతో పాటు దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...