Two Cobras: సైకిలెక్కి షికారుకొచ్చిన నాగుపాముల జోడీ..! వీడియో మాములుగా లేదుగా..

Two Cobras: సైకిలెక్కి షికారుకొచ్చిన నాగుపాముల జోడీ..! వీడియో మాములుగా లేదుగా..

Anil kumar poka

|

Updated on: Mar 27, 2023 | 8:31 AM

పాము ఎదురుపడగానే చెమటలు పట్టి వణికిపోతారు ఎవరైనా.. నోటమాట రాక మొద్దుబారిపోతాం. అలాంటిది ఎదురుగా కళ్ల ముందు ఉంటే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి.

పాము ఎదురుపడగానే చెమటలు పట్టి వణికిపోతారు ఎవరైనా.. నోటమాట రాక మొద్దుబారిపోతాం. అలాంటిది ఎదురుగా కళ్ల ముందు ఉంటే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. ఏకంగా రెండు పాములు ఒకేసారి కనిపించడంతో వణికిపోయాడో వ్యక్తి. మనం పాములుకు సంబంధించిన చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. మనం ఇంట్లో దాక్కున్నా పాముల చూశాం.. కారులో ప్రత్యక్షమైన పాములను చూశాం.. బైక్ లో నక్కిన పాములను కూడా చూశాం. ఇక ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే.. సైకిల్‌పై నాగుపాములు కూర్చుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకటి కాదు.. రెండు నాగుపాములు దర్జాగా సైకిల్ మీదకు ఎక్కి కూర్చున్నాయి. బుసలు కొడుతోన్న ఆ నాగులను చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. దీన్ని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 27, 2023 08:31 AM