Digital TOP 9 NEWS: రాస్తారోకో చేసిన కోతులు | దిగి వస్తున్న టమోటా ధరలు
వాడివేడిగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ, కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ఉభయ సభల్లో ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల అంశం ఉభయసభలను కుదిపేసింది. మణిపూర్ అంశం చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుపట్టడంతో.
వాడివేడిగా సాగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ, కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ఉభయ సభల్లో ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల అంశం ఉభయసభలను కుదిపేసింది. మణిపూర్ అంశం చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుపట్టడంతో.. ఉభయసభల్లో వాయిదాల పర్వం కంటిన్యూ అయ్యింది. విపక్షాల ఆందోళనల నడుమే అధికార పక్షం కొన్ని బిల్లులకు ఏకపక్షంగా ఆమోదముద్ర వేయించుకుంది. ఆఖరి రోజున లోక్‌సభలో భారతమాతను బీజేపీ హత్య చేసిందని రాహుల్ గాంధీ మాటలను ప్రధాని నిన్న లోక్‌సభలో తప్పుబట్టారు. భారతమాత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రతీ భారతీయుడిని బాధపెట్టాయని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్నారు. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌పై రభస జరిగింది. రాజ్యసభలోనూ ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలపై సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి. సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్లాడో చూడండి !!
వంద మందితో డేటింగ్ చేసిన బ్రిటన్ అమ్మాయి !!
అసలే కింగ్ కోబ్రా !! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

