మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది
మొసలి నోట్లో చిక్కితే అంతే సంగతులు. గజేంద్రుడిని మొసలి నుంచి రక్షించడానికి సాక్షాత్తు విష్ణుమూర్తే రావాల్సి వచ్చింది. అలాంటి క్రొకడైల్ బారి నుంచి తప్పించుకుంది ఓ మహిళ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వామ్మో అనిపించుకుంటోంది. ఇండోనేషియాలోని ఫమిర్లా డీ జీసస్ అనే ఆమె పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. నీళ్ళ కోసం తోట పక్కనే ఉన్న నది దగ్గరకు వెళ్ళింది. అందులో మొసలి ఉన్న సంగతి ఆమెకు తెలియదు. నీళ్ళు మొత్తం నాచు మొక్కలతో నిండిపోయి ఉండడం వలన అది కనిపించలేదు కూడా.
మొసలి నోట్లో చిక్కితే అంతే సంగతులు. గజేంద్రుడిని మొసలి నుంచి రక్షించడానికి సాక్షాత్తు విష్ణుమూర్తే రావాల్సి వచ్చింది. అలాంటి క్రొకడైల్ బారి నుంచి తప్పించుకుంది ఓ మహిళ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వామ్మో అనిపించుకుంటోంది. ఇండోనేషియాలోని ఫమిర్లా డీ జీసస్ అనే ఆమె పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. నీళ్ళ కోసం తోట పక్కనే ఉన్న నది దగ్గరకు వెళ్ళింది. అందులో మొసలి ఉన్న సంగతి ఆమెకు తెలియదు. నీళ్ళు మొత్తం నాచు మొక్కలతో నిండిపోయి ఉండడం వలన అది కనిపించలేదు కూడా. కానీ నీళ్ళు తీసుకుందామని నీళ్ళల్లోకి దిగేసరికి ఆమె మీద దాడి చేసింది మొసలి. కాళ్ళను పట్టుకుని నీళ్ళల్లోకి లాక్కెళ్ళిపోయింది. మొసలికి చిక్కితే ఇక ఆ వ్యక్తిని కాపాడటం ఎవ్వరి తరమూ కాదు. కానీ ఫమిర్లాకు భూమి మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆమెను మొసలి తీసుకెళ్ళడం గమనించిన కూలీలు వెంటనే పరుగెత్తుకు వచ్చారు. కర్రలతో కొట్టి విడిపించడానికి ప్రయత్నం చేశారు. ఫమిర్లా కూడా చాలా గట్టిగా పోరాడింది. మొసలి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. అలా గంటపాటూ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించి బాధితురాలిని విడిచిపెట్టింది మొసలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??
వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..
స్టూడెంట్ చెంపపై కొట్టిన టీచర్.. పాపం.. ఆ విద్యార్థి చెవికి
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!

