వంటింట్లో దూరిన దొంగ వానరం.. ఖరీదైన కూరగాలతో పరార్
గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు టమాటా కొనటమే మానేశారు. ఈ క్రమంలోనే టమాటా ధరలకు సంబంధించి అనేక రకాల మీమ్స్, జోకులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అంతేకాదు. టమాట దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా టమాటాలకు సంబంధించిన ఒక వైరల్ వీడియో హల్‌చల్ చేస్తోంది. వైరల్ వీడియోలో ఒక వానరం ఇంట్లోకి ప్రవేశించి టమాటాలు ఎత్తుకెళ్లిపోయిన దృశ్యం
గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు టమాటా కొనటమే మానేశారు. ఈ క్రమంలోనే టమాటా ధరలకు సంబంధించి అనేక రకాల మీమ్స్, జోకులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అంతేకాదు. టమాట దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తాజాగా టమాటాలకు సంబంధించిన ఒక వైరల్ వీడియో హల్‌చల్ చేస్తోంది. వైరల్ వీడియోలో ఒక వానరం ఇంట్లోకి ప్రవేశించి టమాటాలు ఎత్తుకెళ్లిపోయిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఇంటి తలుపులు బార్ల తెరిచి ఉన్నాయి. అంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక కొండముచ్చు ఆ ఇంట్లోకి ప్రవేశించింది.ఎదురుగా ఒక ప్లాస్టిక్ బుట్టలో టమాటాలు, బంగాళదుంపలు కనిపించాయి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అటూ ఇటూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆహా.. ఇక పండగే అనుకుంది ఆ వానరం. వెంటనే ఆ బుట్ట దగ్గరగా వెళ్లి కూర్చుంది. ముందుగా ఓ బంగాళదుంప నోట్లో పెట్టుకుంది. ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. వెంటనే ఆ కొండముచ్చు బుట్టలో టమాటా పట్టుకుని అక్కడ్నుంచి పరారైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య
Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే
ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!
అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్ జామ్ కష్టాలు !!
ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

