Viral Video: రియల్ రాఖీ భాయ్.. టీ తాగేందుకు రైలుబండిని ఆపేసిన పైలట్‌.. చుస్తే ఫ్యూజులు ఔటే..

Viral Video: రియల్ రాఖీ భాయ్.. టీ తాగేందుకు రైలుబండిని ఆపేసిన పైలట్‌.. చుస్తే ఫ్యూజులు ఔటే..

Anil kumar poka

|

Updated on: May 02, 2022 | 9:51 AM

మన సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవచ్చు. బస్సులు లాంటి ప్రజారవాణా వ్యవస్థల్లోనూ ఇలాంటి సదుపాయం ఉంటుంది. అంతెందుకు బస్సు డ్రైవర్లు ఎంతో మంది టీ లేదా టిఫిన్ చేద్దామని


మన సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవచ్చు. బస్సులు లాంటి ప్రజారవాణా వ్యవస్థల్లోనూ ఇలాంటి సదుపాయం ఉంటుంది. అంతెందుకు బస్సు డ్రైవర్లు ఎంతో మంది టీ లేదా టిఫిన్ చేద్దామని బస్సు ఆపిన సందర్భాలు ఎన్నో మనం ఫేస్ చేసుంటాం. కానీ రైలు ప్రయాణంలో ఇలా కుదరదు. ఎందుకు కుదరదు.. ట్రైన్ కూడా పట్టాలపై ఆపేయొచ్చుగా అని మీరనుకోవచ్చు.. నిజమే కానీ తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ఘటనే ఇటీవల బీహార్‌లో చోటుచేసుకుంది. ఓ లోకోపైలట్ తనకిష్టమైన చాయ్‌ కోసం రైలును పట్టాలపై ఆపేశాడు. టీ తాగాక తిరిగి ట్రైన్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.బీహార్ రాష్ట్రం శివన్ జిల్లాలోని సిస్వాన్ ధాలాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రైలు నంబర్ 11123 డౌన్ ఝాన్సీ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ టీ తాగడం కోసం 91A సిస్వాన్ ధాలా వద్ద రైలును ఆపాడు. రైలు కాపలాదారు ధాలా సమీపంలో ఉన్న దుకాణం నుండి టీ తెచ్చి, ఆపై ఇంజిన్ ఎక్కి డ్రైవర్‌కు అందించాడు. ఈ విషయమై స్టేషన్ సూపరింటెండెంట్ అనంత్ కుమార్ విరవరణ కోరగా.. అలాంటి ఫోటో తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఫొటోను అధికారులకు పంపించామన్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్‌.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!

Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!

Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!

Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!

Viral Video: ఓర్నీ దుంపతెగా..! సేమ్ రోబో సినిమానే.. రన్నింగ్‌ ట్రైన్‌పై బుడ్డోడు పరుగులు.. ట్రెండ్ అవుతున్న వీడియో..