Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్‌.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!

భార్యను వదిలి ప్రియురాలితో పారిపోయిన వ్యక్తికి కోర్టు దిమ్మదిరిగే షాకిచ్చింది. వాళ్లను వెతకడానికి అయిన ఖర్చులో సగం మొత్తం కోర్టుకు చెల్లించాలని సదరు వ్యక్తిని ఆదేశించింది. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో జరిగింది.

Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్‌.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!

|

Updated on: May 02, 2022 | 9:36 AM


భార్యను వదిలి ప్రియురాలితో పారిపోయిన వ్యక్తికి కోర్టు దిమ్మదిరిగే షాకిచ్చింది. వాళ్లను వెతకడానికి అయిన ఖర్చులో సగం మొత్తం కోర్టుకు చెల్లించాలని సదరు వ్యక్తిని ఆదేశించింది. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో జరిగింది. అప్పటికే పెళ్లయిన గుజరాత్‌కు చెందిన రాఘభాయ్‌ పర్మార్‌ అనే వ్యక్తి రాజ్‌కోట్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో 2021 మేలో పారిపోయాడు. దాంతో ఆ యువతి తండ్రి కోర్టును ఆశ్రయించాడు. పోలీసులు ఏడు నెలలపాటు శ్రమించి వాళ్ల ఆచూకీ తెలుసుకుని, చివరకు ఆ జంటను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వాళ్లను వెతికేందుకు పోలీసులకు అయిన ఖర్చుల్లో 50 శాతం చెల్లించాలని ఆ వివాహితుడ్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు జోక్యంతో రాజ్‌కోట్‌ పోలీసులు ఏడు నెలలు శ్రమించి ఎట్టకేలకు పారిపోయిన జంట ఆచూకీని కనిపెట్టి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ జంటను వెతికేందుకు తాము 17,710 గంటలు శ్రమించామని, చాలా ఖర్చులయ్యాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. దర్యాప్తు కాలంలో ఇతర ఖర్చులతోపాటు వారిని తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చేందుకు మొత్తం 1,17,500 రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. దీంతో హైకోర్టు ఏప్రిల్‌ 19న విలక్షణమైన తీర్పు ఇచ్చింది. ఆ మహిళను వెతికేందుకు పోలీసులకు అయిన ఖర్చుల్లో సగం 55,000 రూపాయలు కోర్టుకు చెల్లించాలని ఆదేశించింది. పోలీసులకు అయిన మొత్తం ఖర్చులను వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ సగం మొత్తాన్ని ఆ వ్యక్తి భరించడం భావ్యంగా కోర్టు భావించినట్లు తెలిపింది. ఆ మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీకి చెల్లించాలని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ వ్యక్తి చెల్లించిన డబ్బును రాజ్‌కోట్‌ నగర పోలీస్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు బదిలీ చేయాలని కోర్టు రిజిస్ట్రీకి సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు