Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!
మన దేశంలో స్కాచ్ విస్కీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దిగుమతి సుంకాల వల్లే రేటు అధికంగా ఉంటుంది. అయితే త్వరలోనే మద్యం ప్రియులు శుభవార్త వినే అవకాశముంది. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటిస్తున్నారు.
మన దేశంలో స్కాచ్ విస్కీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దిగుమతి సుంకాల వల్లే రేటు అధికంగా ఉంటుంది. అయితే త్వరలోనే మద్యం ప్రియులు శుభవార్త వినే అవకాశముంది. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో బ్రిటన్-భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా విస్కీపై సుంకాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది.ప్రపంచంలోనే విస్కీకి అతి పెద్ద మార్కెట్ ఉంది భారత్‌లో. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత స్కాచ్ విస్కీకి ఇది తీపి వార్తే. అయితే, భారత్‌లో తాగే స్కాచ్ విస్కీ ధర చాలా ఎక్కువ. భారత్ విధించే 150 శాతం దిగుమతి సుంకాలే దీనికి కారణం. ప్రస్తుతం భారత్‌లో విక్రయించే విస్కీలో చాలావరకు స్థానికంగా తయారుచేస్తుంటారు. ఇక్కడి మార్కెట్‌లో స్కాచ్ పరిమాణం కేవలం రెండు శాతం మాత్రమే. అయితే కేవలం విస్కీ మాత్రమే కాదు. బ్రిటన్ నుంచి వచ్చే చాలా దిగుమతులపై భారత్ భారీగా సుంకాలు, కోటాలు, ఆంక్షలు విధిస్తోంది.ఒకవేళ భారత్ ఈ దిగుమతి సుంకాలను తగ్గిస్తే, బ్రిటన్ స్కాచ్ వంటి డ్రిమ్స్ అలాగే కార్లపై కూడా ప్రతిగా అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే ఔషధాలు సహా ఇతర ఉత్పత్తుల కోసం బ్రిటన్ మార్కెట్‌ను మరింత తెరవాల్సి ఉంటుంది. మరోవైపు భారత కార్మికులకు మరిన్ని వీసాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. ఇక తాజాగా భారత్ పర్యటనను ముగించుకోని బ్రిటన్ వెళ్లిపోయిన ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ సుంకాలపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

