Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!
మనం రకరకాల పోటీలు చూసాం. ఎడ్ల బండ్ల పోటీలు, గుర్రాలు, ఒంటెల పోటీలు ఇలా చాలా చూశాం. ఈ మధ్య గాడిదల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అవికూడా మేము గుర్రాలకు ఏమాత్రం తీసిపోము... బరువులు మొయ్యడమే కాదు.. పరుగులు కూడా పెట్టగలం అంటున్నాయి.
మనం రకరకాల పోటీలు చూసాం. ఎడ్ల బండ్ల పోటీలు, గుర్రాలు, ఒంటెల పోటీలు ఇలా చాలా చూశాం. ఈ మధ్య గాడిదల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అవికూడా మేము గుర్రాలకు ఏమాత్రం తీసిపోము… బరువులు మొయ్యడమే కాదు.. పరుగులు కూడా పెట్టగలం అంటున్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూలో గాడిదల పోటీలు నిర్వహించారు. వజ్రకరూర్‌లో వెలసిన శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఈ పరుగు పోటీలను ఏర్పాటు చేశారు. ఈ గాడిదల రన్నింగ్ రేస్ చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ పోటీలను క్రీడామైదానంలో కాకుండా వజ్రకరూరు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్లు గాడిదలపై స్వారీ చేసేలా రేస్ నిర్వహించారు. ఇందులో నాలుగు గాడిదలు పాల్గొనగా చివరికి రేసులో మూడు మాత్రమే మిగిలాయి.ఆద్యంతం ఆసక్తికరంగా పోటాపోటీగా సాగిన ఈ పరుగుపందెం కూర్చుని చూడటానికి వీలు లేదు కాబట్టి యువకులందరూ బైక్ పై గాడిదల వెంట పడ్డారు.. ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు నిర్వహించలేక పోయామన్నారు నిర్వాహకులు. అనంతరం పరుగు పందెంలో విజయం సాధించిన వారికి నగదు బహుమతి అందజేసి శాలువా కప్పి సత్కరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..