ప్రభుత్వమే తీసుకొస్తున్న ‘డేటింగ్ యాప్’ !! తీవ్ర ఆందోళనతో కీలక నిర్ణయం

|

Jun 08, 2024 | 8:06 PM

జపాన్‌లో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యువత కోసం డేటింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయనుంది. మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్‌ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు. అయితే జపాన్‌లో జననాల రేటు తగ్గుతోంది. ఇది తమ దేశం ఎదుర్కొంటోన్న తీవ్ర సంక్షోభమని ఆ దేశ ప్రధాని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే 2070 నాటికి జనాభా 30 శాతం కుచించుకుపోయి 87 మిలియన్లకు పడిపోతుందని అంచనా.

జపాన్‌లో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. యువత కోసం డేటింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయనుంది. మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్‌ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు. అయితే జపాన్‌లో జననాల రేటు తగ్గుతోంది. ఇది తమ దేశం ఎదుర్కొంటోన్న తీవ్ర సంక్షోభమని ఆ దేశ ప్రధాని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే 2070 నాటికి జనాభా 30 శాతం కుచించుకుపోయి 87 మిలియన్లకు పడిపోతుందని అంచనా. టోక్యో స్థానిక యంత్రాంగం ఒక డేటింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయనుంది. జపాన్‌లో వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో 70 శాతం మంది తమ భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఎలాంటి యాప్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసిందనీ, వారు తగిన భాగస్వామిని ఎంచుకునేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుందని ఒక అధికారి మీడియాకు వెల్లడించారు. అయితే డేటింగ్ యాప్‌ ఉపయోగించే వినియోగదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తాము ఒంటరని ధ్రువీకరించే పత్రాలతో పాటు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నామని సంతకాలు చేసిన లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వార్షిక వేతనం నిజమేనని నిరూపించేలా ఒక ట్యాక్స్ సర్టిఫికెట్‌ను ఇవ్వాలి. నాగరికతను కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెప్తుంటారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌. జననాల రేటును పెంచడానికి తాజాగా జపాన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్నం తిన్నతర్వాత త్రేన్పులు వస్తున్నాయా ?? కారణం ఇదే కావచ్చు !!

‘మా’ నుంచి హేమ సస్పెండ్‌ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటన

డెలివరీ తర్వాత నీళ్లు తాగకూడదా ?? తాగితే ఏమవుతుంది ??

Vijay Sethupathi: ఆమెతో రొమాంటిక్‌ సీన్స్‌లో నటించలేను

కొనసాగుతున్న వజ్రాల వేట.. పేదలను వరిస్తున్న వజ్రాలు