ప్రశాంతంగా నడుస్తున్న టైగర్‏ను పరుగులు పెట్టించిన వాటర్… పాపం వణికిపోయిన చిరుతపులి.. వీడియో వైరల్..

Viral Video: చిరుత పులి.. అడవిలో ఉండే మిగతా జంతువుల నుంచి పట్టణాల్లో ఉండే మనుషుల వరకు ప్రతి ఒక్కరిని భయపెట్టించే జంతువు. కంటికి కనిపిస్తే.. వేటాడకుండా వదలదు. పరుగులో దానిని మించి మరే జంతువు ఉండదు.

ప్రశాంతంగా నడుస్తున్న టైగర్‏ను పరుగులు పెట్టించిన వాటర్... పాపం వణికిపోయిన చిరుతపులి.. వీడియో వైరల్..
Tiger Funny Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2021 | 7:49 PM

Viral Video: చిరుత పులి.. అడవిలో ఉండే మిగతా జంతువుల నుంచి పట్టణాల్లో ఉండే మనుషుల వరకు ప్రతి ఒక్కరిని భయపెట్టించే జంతువు. కంటికి కనిపిస్తే.. వేటాడకుండా వదలదు. పరుగులో దానిని మించి మరే జంతువు ఉండదు. అందుకే కంటికి చిక్కి పారిపోవాలనుకొని ప్రయత్నించిన ప్రతి జంతువును వెంటాడి మరీ నోటికందించుకుంటుంది. అలాంటి చిరుతపులిని కేవలం నిశ్చలంగా ఉన్న నీళ్ళు భయపెట్టాయంటే నమ్ముతారా ? కానీ ఇది నిజం. ప్రశాంతంగా నడుస్తున్న పులిని ఒక్కసారిగా భయానికి గురిచేశాయి. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ చిరుత పులి ప్రయత్నించిన తీరు చూస్తుంటే నవ్వులు పూయిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో.. మంచుగా మారిపోయిన నీళ్ళ మీద ఓ చిరుత పులి ప్రశాంతంగా నడుస్తూ వస్తుంది. అలా వస్తున్న క్రమంలో ఓ చోట మంచు కాస్తా కరిగి ఒక్కసారిగా నీళ్ళలో పడిపోతుంది. వెంటనే అలర్ట్ అయిన చిరుత ఆ నీళ్ళలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక పులి నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తీరు చూస్తుంటే నవ్వులు పూయిస్తుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నేచర్ అండ్ ఎనిమల్స్ అనే ట్వీట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. సన్నని మంచు మీద నడుస్తున్న టైగర్.. ఏమి తప్పు జరిగింది.. అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 1,75,000 వ్యూస్ వచ్చాయి. 2,700 మందికి పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.

ట్వీట్..

Also Read: కత్రినా కైఫ్ గురించి మనసులో మాటను బయటపెట్టిన విరాట్… నెట్టింట్లో వైరల్‏గా మారిన కోహ్లీ వీడియో..

‘నేను వాడిని చంపేస్తాను’.. సూపర్ స్టార్ నోట తెలుగు మాట.. ‘ఆరాట్టు’ టీజర్ ఇంట్రెస్టింగ్..

సోనూసూద్ చేసిన పనికి చిరు టీం షాక్.. స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన రియల్ హీరో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!