బైక్‌పైనుంచి పడిపోయిన వ్యక్తి.. సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తికి బిగ్ షాక్ !!
కాకినాడ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు నయామోసానికి తెర లేపారు. జనాలను మభ్యపెట్టి చాకచక్యంగా వారివద్దనుంచి సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. ప్రమాదంలో పడినట్టు సీన్ క్రియేట్ చేసి అవతలి వ్యక్తుల మానవత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. బైక్ పైన వెళ్తూ పడిపోయినట్టుగా నటిస్తున్నారు. సాయం చేద్దామని వెళ్లిన వాళ్లనుంచి డబ్బు, సెల్‌ఫోన్లను కొట్టేస్తున్నారు. ఇలాంటి ముఠా కాకినాడ జిల్లాల సామర్లకోటలో దిగింది.
కాకినాడ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు నయామోసానికి తెర లేపారు. జనాలను మభ్యపెట్టి చాకచక్యంగా వారివద్దనుంచి సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. ప్రమాదంలో పడినట్టు సీన్ క్రియేట్ చేసి అవతలి వ్యక్తుల మానవత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. బైక్ పైన వెళ్తూ పడిపోయినట్టుగా నటిస్తున్నారు. సాయం చేద్దామని వెళ్లిన వాళ్లనుంచి డబ్బు, సెల్‌ఫోన్లను కొట్టేస్తున్నారు. ఇలాంటి ముఠా కాకినాడ జిల్లాల సామర్లకోటలో దిగింది. దారినపోయేవాళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. మెహరా కాంప్లెక్స్ దగ్గర ఓ యువకుడు బైక్ పైనుంచి పడిపోతున్నట్టు నటించాడు. అది చూసిన ఓ వ్యక్తి సాయం చేద్దామని గబగబా అతని వద్దకు పరుగెత్తాడు. బైక్‌ను పైకి లేపి అతనికి సాయం చేశాడు. ఈ క్రమంలోనే దొంగ తన ప్లాన్ అమలు చేశాడు. అతని జేబులోంచి సెల్‌ఫోన్ కొట్టేశాడు. సాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పి బైక్ స్టార్ట్ చేయగానే అక్కడే ఉన్న మరో యువకుడు వచ్చి బైక్‌పైన కూర్చున్నాడు. ఫోన్ పోయిన విషయం సాయం చేద్దామని వచ్చిన వ్యక్తికి తెలిసే లోపు క్షణాల్లో వారు పారిపోయారు. తరచూ ఇలాంటి మోసాలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఒక్కరోజే సామర్లకోటలో నాలుగుచోట్ల సెల్‌ఫోన్లు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో ఈ దొంగల ముఠాకోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..
విదేశీ గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం
iSmart News: ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు