మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..
ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆమె సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై తన గళం వినిపిస్తుంటారు. తాజాగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కోల్‌కత్తాలోని ఆర్‌జీ కార్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆమె సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై తన గళం వినిపిస్తుంటారు. తాజాగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కోల్‌కత్తాలోని ఆర్‌జీ కార్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘటన అంటూ అందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఘోరంపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ కూడా కూడా స్పందించారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉన్నారు. తాజాగా ఇదే ఘటనపై మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్. మీ కొడుకుకు మహిళలను ఎలా గౌరవించాలో నేర్పించండి.. ఎందుకంటే నేను కూడా నా కుమార్తెకు ఎముకలు విరగ్గొట్టడం నేర్పించబోతున్నాను అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. దీనికి బ్యాక్ గ్రౌండ్‌లో కరాటే నేర్పిస్తున్న ఫొటో ను జత చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు రేణు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ‘గుడ్ డెసిషన్ మేడమ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీ గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం
iSmart News: ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

