నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కారులో నలుగురు..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షాలనికి ట్రాఫిక్‌​కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా గోడౌన్స్ వద్ద ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఇది గమనించి వెంటనే అలర్టయ్యారు.

నాలాలోకి దూసుకెళ్లిన కారు.. కారులో నలుగురు..

|

Updated on: Aug 20, 2024 | 10:41 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షాలనికి ట్రాఫిక్‌​కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా గోడౌన్స్ వద్ద ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు ఇది గమనించి వెంటనే అలర్టయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, ముగ్గురు చిన్నారులతో సహా ఆ కుటుంబాన్ని క్షేమంగా కాపాడారు. హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా కారులో ఎల్బీనగర్ వైపు వెళ్తున్నారు. ఓ వైపు జోరు వాన పడుతుండటంతో వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతికి కారు అదుపు తప్పింది. జాతీయ రహదారి పక్కన వర్షపు నీటితో నిండిన నాలాలోకి దూసుకెళ్లింది. అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు, సిఐ వెంకటేశ్వర్లు అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న వారందరినీ సురక్షితంగా కాపాడారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అటల్‌ సేతు పైనుంచి దూకేందుకు మహిళ యత్నం.. అంతలో..

తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి.. ముచ్చటగా మూడోసారి కూలింది..

Kalki 2898 AD: ఓటీటీలో కి కల్కీ మూవీ.. స్ట్రీమింగ్‌ అప్పుడే !!

బైక్‌పైనుంచి పడిపోయిన వ్యక్తి.. సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తికి బిగ్‌ షాక్‌ !!

మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..

Follow us