అటల్‌ సేతు పైనుంచి దూకేందుకు మహిళ యత్నం.. అంతలో..

అటల్‌ సేతు పైనుంచి దూకేందుకు మహిళ యత్నం.. అంతలో..

Phani CH

|

Updated on: Aug 20, 2024 | 10:40 PM

ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. బ్రిడ్జి రెయిలింగ్ దాటుకుని కిందకు దూకుతుండగా చివరిక్షణంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను పట్టుకున్నాడు. అప్పటికే అక్కడున్న పోలీసులు కూడా వెంటనే స్పందించి మహిళను కాపాడారు. శుక్రవారం సాయంత్రం అటల్ సేతు బ్రిడ్జిపై జరిగిన ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. బ్రిడ్జి రెయిలింగ్ దాటుకుని కిందకు దూకుతుండగా చివరిక్షణంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను పట్టుకున్నాడు. అప్పటికే అక్కడున్న పోలీసులు కూడా వెంటనే స్పందించి మహిళను కాపాడారు. శుక్రవారం సాయంత్రం అటల్ సేతు బ్రిడ్జిపై జరిగిన ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. సూసైడ్ అటెంప్ట్ చేసిన మహిళ పేరు రీమా ముఖేశ్ పటేల్ అని, నార్త్ ఈస్ట్ ముంబైలోని ములంద్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. దూకడానికి ముందుగా రీమా తన చేతిలో ఉన్నదానిని సముద్రంలో పడేయడం వీడియోలో కనిపించింది. క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తి, బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంటనే స్పందించడంతో రీమా ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘జీవితం విలువ గుర్తించాలి, పరిస్థితులు ఎలా మారినా ఇలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు’ అంటూ నగర పౌరులకు ముంబై పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి.. ముచ్చటగా మూడోసారి కూలింది..

Kalki 2898 AD: ఓటీటీలో కి కల్కీ మూవీ.. స్ట్రీమింగ్‌ అప్పుడే !!

బైక్‌పైనుంచి పడిపోయిన వ్యక్తి.. సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తికి బిగ్‌ షాక్‌ !!

మీ కొడుకులకి మహిళలను గౌరవించడం నేర్పించండి.. రేణూ దేశాయ్ సంచలన పోస్ట్..

విదేశీ గడ్డపై రామ్ చరణ్ కు విశిష్ట గౌరవం